భారత దిగ్గజ ఇంధన సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఓసీఎల్) అప్రెంటీస్‌షిప్(iocl apprenticeship 2021) కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. అప్రెంటీస్‌షిప్ చట్ట 1961 ప్రకారం.. టెక్నికల్, నాన్ టెక్నికల్ విభాగల్లో 469 ఖాళీలకు నోటిఫికేషన్ జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న 5రీజియన్లలోని పైప్‌లైన్ ప్రాజెక్టుల్లో అప్రెంటీస్‌షిప్ కల్పిస్తోంది(apprenticeship in IOCL). అక్టోబర్ 5నుంచి దరఖాస్తు ఫారాలు ఐఓసీఎల్ అధికారిక వెబ్సైట్లో (IOCL Recruitment )అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. దరఖాస్తు పంపాల్సిన చివరి తేదీ అక్టోబర్ 25గా నిర్ణయించారు.
ఇంజనీరింగ్ డిగ్రీ, ఎంబీఏ వంటి ఉన్నత విద్యా అర్హతలు, దానికి సమానమైన పీజీడీఎం, ఎంసీఏ, ఎల్ఎల్బీ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, సోషల్ వర్క్‌లో మాస్టర్స్, జర్నలిసమ్లో డిగ్రీ వంటివి, ప్రొఫోషనల్ క్వాలిఫికేషన్ ఉన్న వారు దరఖాస్తు చేసేందుకు అర్హులు కాదని స్పష్టం చేసింది ఐఓసీఎల్.