తెలంగాణ

telangana

'ఆ కమిటీ సిఫార్సు మేరకే ఎన్నికల కమిషనర్ల నియామకం'.. సుప్రీం కీలక ఆదేశాలు

By

Published : Mar 2, 2023, 11:26 AM IST

Updated : Mar 2, 2023, 12:54 PM IST

ఎన్నికల కమిషనర్ల నియామకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రధాని, ప్రతిపక్ష నేత, సీజేఐ సభ్యులుగా ఉన్న కమిటీనే.. కమిషనర్లను నియమించాలని ఆదేశించింది. ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పు వెల్లడించింది. దీంతో ప్రభుత్వం ఇంతకాలం ఈసీ, సీఈసీ నియామకానికి అనుసరిస్తున్న విధనాన్ని రద్దు చేస్తున్నట్లు సుప్రీం తెలిపింది.

election commission
election commission

ఎన్నికల కమిషనర్ల నియామకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రధాని, ప్రతిపక్ష నేత, సీజేఐ సభ్యులుగా ఉన్న కమిటీనే కమిషనర్లను నియమించాలని ఆదేశించింది. ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం గురువారం ఈ ఉత్తర్వులు వెల్లడించింది. ప్రతిపక్ష నేత లేకపోతే విపక్షంలో మెజారిటీ పార్టీ సభ్యుడు కమిటీలో ఉండాలని తెలిపింది. కమిటీ సిఫార్సుల మేరకే ఈసీలను రాష్ట్రపతి నియమించాలని ఆదేశించింది.

ఎన్నికల కమిషనర్లు, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ నియామకానికి కొలీజియం తరహా వ్యవస్థను ఏర్పాటు చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై ధర్మాసనం ఈ తీర్పును వెల్లడించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్​, ఎన్నికల కమిషనర్​లను నియమించే కమిటీలో.. ప్రధాని, ప్రతిపక్ష నేత, సీజేఐ సభ్యులుగా ఉన్న కమిటీ ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్రపతి వారిని నియమించాలని సుప్రీంకోర్టు గురువారం తీర్పునిచ్చింది. ఈ తీర్పు ద్వారా ఎన్నికల్లో పారదర్శకత మరింత పెరుగుతుందని సుప్రీం తెలిపింది.

న్యాయమూర్తి జస్టిస్ కేఎమ్​ జోసెఫ్ నేతృత్వంలోని జస్టిస్​ అజయ్​ రస్తోగి, జస్టిస్​ అనిరుద్ధ బోస్​, జస్టిస్​ హృషికేష్​ రాయ్​, జస్టిస్​ సీటీ రవికుమార్​తో కూడిన ప్రత్యేక ధర్మాసనం.. ఇది ప్రజాస్వామ్యం, ప్రజాసంకల్పంతో ముడిపడిన అంశమని పేర్కొంది. ఈ ధర్మాసనం ప్రజాస్వామ్యంలో ఎన్నికలు పారదర్శకత అవసరం లేదంటే.. అది దేశ వినాశనానికి దారి తీస్తుందని సుప్రీం స్పష్టం చేసింది. ఈసీ రాజ్యాంగ పరిధిలోని చట్టాలకు అనుగుణంగా ఉండాలని.. అన్యాయంగా వ్యవహరించకూడదని ధర్మాసనం పేర్కొంది. ఐదుగురు న్యాయమూర్తులు కలిగిన ప్రత్యేక ధర్మాసనం వెల్లడించిన ఏకగ్రీవ తీర్పు.. ఈ అంశంపై పార్లమెంటు చట్టం చేసే వరకు అమల్లో ఉంటుందని తేల్చిచెప్పింది.

ఎన్నికల కమిషన్​ నియామకం
స్వతంత్ర భారత దేశంలో ఎన్నికలను నిష్పక్షపాతంగా, సజావుగా నిర్వహించేదుకు రాజ్యాంగం ఏర్పాటు చేసిన సంస్థ 'భారత ఎన్నికల కమిషన్​'. 1950 జనవరి 25న ఈ ఎన్నికల కమిషన్​ భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇది సుప్రీంకోర్టు వలె ప్రభుత్వ నియంత్రణకు లోబడి పనిచేస్తుంది. ఇది దేశంలో రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, లోక్​సభ, రాజ్యసభ, రాష్ట్రాల శాసన సభలు, శాసన మండళ్లకు జరిగే ఎన్నికలను నిర్వహిస్తుంది. ఈ ఎన్నికల కమిషన్​కు ఉండే అధినేతను 'ప్రధాన ఎన్నికల కమిషనర్' అంటారు. ప్రస్తుతం అతనితో పాటుగా మరో ముగ్గుర ప్రధాన ఎన్నికల కమిషనర్లు ఉంటారు. దీంతో పాటుగా ప్రతి రాష్ట్రానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఉంటారు. అయితే ప్రధాన ఎన్నికల కమిషనర్​ను, రాష్ట్ర ఎన్నికల కమిషనర్లను రాష్ట్రపతి నియమిస్తారు. అయితే అధికార పార్టీలు తమకు అనుకూలంగా ఉండే వ్యక్తులను కమిషనర్లుగా నియమిస్తున్నారని.. అందుకే ఈ నియామకంలో కొలీజియం వ్యవస్థ ఉండాలంటూ పిటిషన్లు దాఖలైయ్యాయి. దీంతో ఈసీ, సీఈసీ నియామకాల విషయంలో ప్రభుత్వం ఇంత వరకు అనుసరిస్తున్న పద్దతిని సుప్రీం రద్దు చేసింది.

Last Updated : Mar 2, 2023, 12:54 PM IST

ABOUT THE AUTHOR

...view details