APAAR ID Card for All Students :దేశంలోని పౌరులందరికీ ఆధార్ గుర్తింపు కార్డు ఇస్తున్నట్టుగా.. విద్యార్థులందరికీ "అపార్" (APAAR CARD) పేరుతో ఓ కొత్త ఐడీ కార్డును కేంద్రం జారీచేస్తోంది. జాతీయ విద్యా విధానం (NEP) 2020లో భాగంగా ఇండియా అంతటా ఉన్న విద్యార్థుల కోసం ఈ సరికొత్త ఐడీ కార్డును ప్రారంభించింది. ఇంతకీ అపార్ కార్డు అంటే ఏమిటి? ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? ఏవిధంగా డౌన్ లోడ్ చేసుకోవాలి? ఈ కార్డు వల్ల కలిగే ప్రయోజనాలేంటి? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఏమిటీ కార్డు?
APAAR అంటే.. ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ. దీనినే వన్ నేషన్.. వన్ స్టూడెంట్ ID కార్డు అని కూడా పిలుస్తారు. భారత ప్రభుత్వం ఈ కార్డులను జారీ చేసేందుకు అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ (ABC)ని ప్రారంభించింది. ఇది ఎకో సిస్టమ్ రిజిస్ట్రీగా పనిచేస్తుంది. దీనిని "Edulocker"గా సూచిస్తారు. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ వీటిని జారీ చేస్తోంది. దేశవ్యాప్తంగా అన్ని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలు లేదా కళాశాలలో చదువుతున్న విద్యార్థుల కోసం రూపొందించిన డిజిటల్ ఐడీ కార్డు అపార్. ఈ కార్డు ద్వారా విద్యార్థులు తమ అకడమిక్ క్రెడిట్లు, డిగ్రీలు, ఇతర సమాచారాన్ని ఆన్ లైన్ ద్వారా ఈజీగా సేకరించుకోవచ్చు.
అపార్ ఐడీ కార్డు అనేది జీవిత కాల ఐడీ నెంబర్. ఈ కార్డు విద్యార్థుల విద్యా ప్రమాణం, విజయాలను ఎప్పటికప్పుడు నమోదు చేయడంతో పాటు ట్రాక్ చేస్తుంది. అలాగే ఒక స్కూల్ నుంచి మరొక స్కూల్‌కు బదిలీ అవ్వడాన్ని సులభతరం చేస్తుంది. ప్రీ ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు ప్రతి విద్యార్థికీ స్కూల్స్, కాలేజీలు ఈ అపార్ కార్డును జారీ చేస్తాయి.
How to Register for APAAR ID Card :
APAAR ID కార్డు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే..?
- ముందుగా అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ (ABC బ్యాంక్) వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
- ఆ తర్వాత My Account పై క్లిక్ చేసి Student అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.
- అనంతరం డిజిలాకర్ అకౌంట్ తెరవడానికి Sign up పై క్లిక్ చేయాలి.
- ఇప్పుడు మొబైల్ నంబర్, చిరునామా, ఆధార్ కార్డు వంటి వివరాలను నమోదు చేయాలి.
- ఆ తర్వాత మీ వ్యక్తిగత ఆధారాలను ఉపయోగించి DigiLocker అకౌంట్‌కి లాగిన్ అవ్వాలి.
- ఇప్పుడు KYC ధ్రువీకరణ కోసం ABCతో ఆధార్ కార్డు వివరాలను పంచుకోవడానికి.. DigiLocker మీ పర్మిషన్ అడుగుతుంది. 'I Accept'పై నొక్కాలి.
- అనంతరం మీ పాఠశాల/యూనివర్సిటీ పేరు, తరగతి, కోర్సు మొదలైన విద్యావివరాలను ఎంటర్ చేయాలి.
- ఇక చివరగా ఫారమ్‌ను Submit చేస్తే.. APAAR ఐడీ కార్డు క్రియేట్ అవుతుంది.