AP Police Special Rules :'నవ్వి పోదురుగాక.. నాకేటి సిగ్గు..' అనే నానుడి వైసీపీ ప్రభుత్వం, పోలీసుల విషయంలో సరిగ్గా వర్తిస్తుంది. ఇక్కడ చట్టాలు, సెక్షన్లు బలాదూర్..! ఏపీలో చట్టం తన పని తాను చేసుకోవడం లేదు. ఆదమరిచి, అస్త్రాలను విడిచి అధికార పార్టీ చెంతన నిద్దురోతోంది. వైసీపీ (YCP) నేతల దందాలకు వంత పాడుతూ ప్రభుత్వ నేతలతో చెట్టపట్టాలేసుకుని తిరుగుతోంది. చెవులు మూసుకున్న పోలీస్ అధికారుల తీరు.. మొత్తం ఆ శాఖకు మచ్చ తీసుకొస్తోంది.
అన్ని ప్రయత్నాలు చేసినా.. న్యాయం కనుచూపు మేర లేకుంటే ఇక కత్తి పట్టడమే..' పోరాటానికి ఇదే సరైన విధానమంటూ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా (Siddhartha Luthra) చేసిన ట్వీట్ చేశారు. 'నేటి సూక్తి' టైటిల్‌తో గురుగోవింద్ సింగ్ సూక్తులు ప్రస్తావిస్తూ లూథ్రా చేసిన ట్వీట్(Tweet) వైరల్ అవుతోంది. ఏపీలో జరుగుతున్న తాజా పరిణామాల నేపథ్యంలో సిద్ధార్థ ట్వీట్ ఆలోచింపజేస్తోంది.
Sidharth Luthra Tweet: న్యాయం కనుచూపు మేర లేకుంటే ఇక కత్తి పట్టడమే.. సిద్ధార్థ లూథ్రా ఆసక్తికర ట్వీట్
ఏపీలో వైసీపీ పాలనలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదని.. రాజారెడ్డి రాజ్యాంగం (Raja Reddy Constitution) నడుస్తోందని తెలుగుదేశం పార్టీ నేతలతో పాటు విపక్ష నేతలు, ప్రజాసంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. చట్టపరమైన వ్యవస్థలను జగన్ తన ఆధీనంలోకి తీసుకున్నాడని ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ప్రశ్నించే గొంతుకలను అణచి వేస్తున్నాయని మండిపడుతున్నాయి. చంద్రబాబు నాయుడు అరెస్టు (Chandrababu Naidu arrested) పై ఇతర రాష్ట్రాలకు చెందిన వివిధ పార్టీల నేతలు స్పందిస్తూ... ఏపీలో ప్రభుత్వాధినేతలు రాజకీయ విద్వేషంతో రగిలి పోతున్నారు.. ఇది సరైన పద్ధతి కాదని పేర్కొనడం విదితమే.
TDP fire on YCP government : 'చంద్రబాబుకు అవినీతి మరక అంటించాలన్నదే జగన్ లక్ష్యం..' 'అరెస్టు పిరికిపంద చర్య' : టీడీపీ నేతల ఆగ్రహం
కేసు లేకుండానే అరెస్టు... స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ (Skill development scam) సృష్టించిన వైసీపీ ప్రభుత్వం.. ఎఫ్ఐఆర్ (FIR)లో పేరు లేని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్టు చేసింది. ఈ సందర్భంగా తీవ్రవాదుల విషయంలో వ్యవహరించని తీరును కనబర్చడంపై సామాన్యులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి అరెస్టు విషయంలో.. గవర్నర్‌కు ముందస్తు సమాచారం ఇవ్వాలన్న కనీస నిబంధనలూ ఉల్లంఘించడం విచారకరం. పక్కా ప్రణాళికతో, ఆయన పెళ్లి రోజుకు ఒక్క రోజు ముందుగా అదుపులోకి తీసుకుని ప్రభుత్వ పెద్దలు పైశాచిక ఆనందం పొందారని, రాజకీయ కక్ష, అవినీతి మరక అంటించడమే జగన్ లక్ష్యమని టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
నేరారోపణ లేకుండానే శిక్ష..జగన్‌పై జరిగిన కోడికత్తి కేసు (Kodikatti case) మరో ఎత్తు. ఎన్నికలకు ముందు ఆడిన జగన్నాటకంలో ఇది ఓ భాగమని దళిత వర్గాలు మండిపడుతున్నాయి.కోడి కత్తి కేసులో జనుపల్లి శ్రీను నాలుగున్నరేళ్లుగా రిమాండ్ ఖైదీ (Remand prisoner) గా ఉంటున్నాడు. శిక్షకు మించి రిమాండ్ ఖైదీగా ఉంచడం దేశ చరిత్రలో ఇదే మొదటిది కావొచ్చు అని న్యాయవాదులు పేర్కొంటున్నారు.
'హత్యాయత్నం కేసులో ఐదు సంవత్సరాలు జైల్లో ఉండటం అనేది.. మొదటిసారి చూస్తున్నా. ముఖ్యమంత్రి కోర్టుకు వెళ్లకుండా కాలయాపన చేస్తున్నారు' అని విరసం ఐక్యవేదిక కన్వీనర్ బూసి వెంకటరావు వ్యాఖ్యానించడం ఇక్కడ ప్రస్తావనాంశం.
AP HC adjourned Chandrababu Quash petition Hearing : అప్పటి వరకు కస్టడీ పిటిషన్‌ను విచారించొద్దు.. ఏసీబీ కోర్టుకు ఆదేశం