AP MLC Parvatha Reddy Chandrasekhar Reddy :నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రేగడిచెలక వద్ద అర్ధరాత్రి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వైఎస్సార్సీపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని నెల్లూరు అపోలో ఆసుపత్రికి తరలించారు. విజయవాడ నుంచి నెల్లూరుకు వస్తుండగా కారు ముందు వెళ్తున్న లారీ టైర్ అకస్మాత్తుగా పంక్చర్ కావడంతో లారీ నెమ్మదించింది.
రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డికి తీవ్ర గాయాలు - పీఏ మృతి - MLC road accident
AP MLC Parvatha Reddy Chandrasekhar Reddy: నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర గాయాలవ్వగా ఒకరు మృతి చెందారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Published : Jan 5, 2024, 7:03 AM IST
వెనక వైపు నుంచి వేగంగా వచ్చిన ఎమ్మెల్సీ కారు లారీని ఢీకొని డివైడర్‌పై పడింది. దీంతో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి పీఏ అక్కడికక్కడే మృతి చెందారు. చంద్ర శేఖర్ రెడ్డి తలకి బలమైన గాయం తగిలి తీవ్ర రక్తస్రావంతో కుప్పకూలిపోయాడు. అదే మార్గంలో వస్తున్న డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ప్రమాదాన్ని గుర్తించారు. హుటాహుటిన వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చంద్రశేఖర్‌రెడ్డి చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.