తెలంగాణ

telangana

ETV Bharat / bharat

AP leaders Condolence on Gaddar Death గద్దర్ మృతి పట్ల ఏపీ నేతల సంతాపం.. - CM Jagan on Gaddar

AP leaders Condolence on Gaddar Death: ప్రముఖ ప్రజా గాయకుడు గద్దర్ హాస్పటల్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన పాటలతో కోట్లాది మంది హృదయాల్లో చెరగని ముద్ర వేశారు.. సిల్వర్​స్క్రీన్​పై తన పాటలతో మెరిశారు. గద్దర్ మృతిపై రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు.

Condolence_on_Gaddar_Death
Condolence_on_Gaddar_Death

By

Published : Aug 6, 2023, 9:27 PM IST

AP Political Leaders Condolence on Gaddar Death: ప్రజా కవి గద్దర్ మరణంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గద్దర్ ప్రజా కవి- గాయకుడు, బడుగు, బలహీనవర్గాల విప్లవ స్ఫూర్తి అని సీఎం సందేశంలో తెలిపారు. గద్దర్ పాట ఎప్పుడూ సామాజిక సంస్కరణల పాటేనని, ఆయన నిరంతరం సామాజిక న్యాయం కోసమే బతికారని , ఆయన మరణం ఊహించనిదన్నారు. సామాజిక న్యాయ ప్రవక్తల భావాలు, మాటలు, వారి జీవితాలు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూ జీవించే ఉంటాయన్న సీఎం.. గద్దర్ గారికి మొత్తంగా తెలుగు జాతి సెల్యూట్ చేస్తోందన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ఈ కష్ట సమయంలో మనమంతా బాసటగా ఉందామని సీఎం తెలిపారు.

Gaddar Passed Away: ప్రముఖ ప్రజాగాయకుడు గద్దర్ కన్నుమూత.. రేపు అంత్యక్రియలు

Chandrababu Condolence on Gaddar Death: ప్రజా గాయకుడుగద్దర్ మృతి పట్ల టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. పాటలతో ప్రజా చైతన్యానికి ఎనలేని కృషి చేసిన “ప్రజా యుద్ధనౌక” గద్దర్ అని చంద్రబాబు కొనియాడారు. తన గళంతో ప్రజలను కదిలించిన గద్దర్ మృతితో ప్రజా ఉద్యమాల్లో... పౌరహక్కుల పోరాటాల్లో... ఒక శకం ముగిసినట్లు అయ్యిందన్నారు. గద్దర్ కుటుంబసభ్యులకు సానుభూతి తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నట్లు తెలిపారు.

Pawan Kalyan Condolence on Gaddar Death: ప్రజాగాయకుడు గద్దర్‌ మృతి పట్ల జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రగాఢ సంతాపం తెలిపారు. పీడిత వర్గాల కోసం తపించి.. చేసిన పోరాటమే అతన్ని చిరస్మరణీయుణ్ణి చేశాయని, తెలంగాణ ఉద్యమ కాలంలో తన కలం, తన గళంతో నిర్వర్తించిన పాత్ర విస్మరించలేనిదని పవన్‌ కల్యాణ్‌ గుర్తుచేసుకున్నారు. గద్దర్ మరణం నమ్మశక్యం కావడం లేదని... అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన అతన్ని పరామర్శించేందుకు కొద్ది రోజుల క్రితమే తాను వెళ్ళానని.. తమ్ముడా.. అంటూ ఆప్యాయంగా పలకరించి, ప్రస్తుత తెలుగు రాష్ట్రాల్లో నెలకొని ఉన్న పరిస్థితుల గురించి, జాతీయ అంతర్జాతీయ విషయాలు ఎన్నింటినో మాట్లాడారని గుర్తు చేసుకున్నారు. మా భూమి చిత్రంలో గానం చేసిన "బండెనక బండి కట్టి పదహారు బళ్ళు కట్టి" అనే చైతన్య గీతం అజరామరమని కొనియాడారు.

హాస్పటల్​కి వెళ్లి పరామర్శించిన పవన్ కల్యాణ్

Gaddar songs :'గద్దర్​'కు నంది అవార్డు తెచ్చిపెట్టిన వెండితెర​ సాంగ్స్​ తెలుసా?.. అసలా పేరు ఎలా వచ్చిందంటే?​

Daggubati Purandeshwari Condolence on Gaddar Death:ప్రజాగాయకుడు గద్దర్‌ మృతి పట్ల దగ్గుబాటి పురందేశ్వరి ప్రగాఢ సంతాపం తెలిపారు. ఒక విప్లవ గళం మూగపోయిందని అన్నారు. దళితులు, వెనుకబడిన కులాలు వారి వ్యధను వినిపించే వాణి నిశబ్దమైందని.. గద్దర్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నానని అన్నారు.

Nara Lokesh Condolence on Gaddar Death: ప్రజా గాయకుడు గద్దర్ గొంతు మూగబోయిందని సమాచారం తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విప్లవ ఉద్యమాలకి తన పాటనిచ్చి తెలంగాణ ఉద్యమ గళం అయ్యారని కొనియడారు. ప్రజాయుద్ధ నౌక గద్దర్ స్మృతిలో నివాళులు తెలిపారు. ప్రజల పాటకి జోహార్ ,ఉద్యమగీతానికి జోహార్. గద్దర్ అమర్ రహే అని పేర్కొన్నారు.

Gaddar life : వెయ్యిడప్పులు, లక్షగొంతుల కలయిక

Nandamuri Balakrishna Condolence on Gaddar Death: తన ఆటపాటలతో ప్రజా ఉద్యమాలు నడిపించిన విప్లవకారుడు, ప్రజా ఉద్యమ నాయకుడు గద్దర్ మృతి పట్ల సినీ నటులు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజా ఉద్యమాల్లో గద్దర్ లేని లోటును ఎవ్వరు తీర్చలేరని బాలకృష్ణ అన్నారు. గద్దర్ ఓ విప్లవశక్తి అని పేర్కొన్నారు. ప్రజా ఉద్యమ పాటలంటే తెలుగు రాష్ట్రాల్లోనూ దేశవ్యాప్తంగా గద్దర్ గుర్తుకు వస్తారని కొనియాడారు.

Achchennaidu Condolence on Gaddar Death:విప్లవకారుడు, ప్రజా ఉద్యమ నాయకుడు గద్దర్ మృతి పట్ల టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఎన్నో ప్రజా ఉద్యమాలకు పురుడు పోసిన వ్యక్తి గద్దర్ అని.. తన పాటలతో ప్రసంగాలతో నూతన చైతన్యాన్ని నింపేవారని అచ్చెన్నాయుడు తెలిపారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం రాజీలేని పోరాటం చేశారన్నారు. గద్దర్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details