MINISTER AMARNATH ON VIZAG STEEL PALNT: విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు తమ ప్రభుత్వం వ్యతిరేకం అని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమపై వస్తున్న వార్తలపై స్పందించిన మంత్రి.. విశాఖ ఉక్కు రాష్ట్ర ప్రజల సెంటిమెంట్ అన్నారు. లాభనష్టాలు చూడకుండా స్టీల్‌ప్లాంట్‌ను కేంద్రమే నడపాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని కేసీఆర్ అన్నారని అమర్‌నాథ్ గుర్తు చేశారు.
విశాఖ ఉక్కు పరిశ్రమ కొనుగోలుపై తెలంగాణ నుంచి అధికారిక ప్రకటన ఏదీ ఇప్పటివరకూ రాలేదన్నారు. కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వ ప్రకటన లేకుండా ఏం మాట్లాడగలం? అని ప్రశ్నించారు. రాజకీయాల కోసం వాళ్లు ఏవేవో మాట్లాడతారని.. రాజకీయ విమర్శలకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.
అందుకే తెలంగాణ సీఎం కేసీఆర్ ముందుకొచ్చారు: విశాఖ స్టీల్ ప్లాంట్‌ని భావితరాలకు ఇచ్చే బాధ్యత తమదే అని బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ హామీ ఇచ్చారు. స్టీల్‌ప్లాంట్ విషయంలో రాజకీయాల్ని అడ్డుకొని తీరతామని... ప్రైవేటీకరణ ఒక క్రూరమైన చర్య అని వ్యాఖ్యానించారు. తాను విశాఖలో చదువుతున్నప్పుడు స్టీల్ ప్లాంట్ ఆందోళనల్ని కళ్లారా చూశానన్నారు. నష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్‌ను.. కార్మికులు కష్టపడి మూడు లక్షల కోట్ల రూపాయల మేర ఆస్తులను పెంచారని.. వీటిని కబ్జా చేయడం కోసమే.. బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. అదానీకి కట్టబెట్టేందుకు పావుల కదుపుతోందని విమర్శించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో మూడు స్పష్టమైన డిమాండ్లు ఉన్నట్లు తోట వెల్లడించారు.
1. ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి...