Chandrababu Skill Development Case: స్కిల్ కేసు.. చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై పిటిషన్‌పై హైకోర్టు తీర్పు రిజర్వ్
Published : Oct 30, 2023, 3:46 PM IST
|Updated : Oct 30, 2023, 4:12 PM IST
15:41 October 30
మధ్యంతర బెయిల్‌పై రేపు నిర్ణయం వెల్లడిస్తామన్న న్యాయమూర్తి
Chandrababu Skill Development Case: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై మంగళవారం నిర్ణయం వెల్లడిస్తామని న్యాయమూర్తి పేర్కొన్నారు. మెయిన్ బెయిల్ పిటిషన్‌పై వాదనలు ఎప్పుడనేది రేపు నిర్ణయం తీసుకోనున్నట్లు న్యాయమూర్తి తెలిపారు.
స్కిల్ కేసులో ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన నేపథ్యంలో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే... చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ తో పాటుగా... మరో సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వర్చువల్‌గా హైకోర్టులో వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కోర్టుకు హాజరయ్యారు. చంద్రబాబు ఆరోగ్యం దృష్ట్యా బెయిల్ ఇవ్వాలని.. కంటికి ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారంటూ.. చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం బెయిల్ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసింది.