తెలంగాణ

telangana

ETV Bharat / bharat

AP High Court Chief Justice Dhiraj Singh Thakur visited Tirumala: తిరుమల స్వామివారిని దర్శించుకున్న ఏపీ హైకోర్టు సీజే.. - తిరములలో జస్టిస్ శ్యామ్ సుందర్

AP High Court Chief Justice Dhiraj Singh Thakur visited Tirumala: ఆంధ్రప్రదేశ్​ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అంతేకాకుండా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్యామ్ సుందర్ కూడా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా తిరుమల ఆలయ తలుపులు సాయంత్రం 7గంటలకు మూసివేయనున్నట్లు ఆలయాధికారులు ప్రకటించారు.

Etv Bharatap_high_court_chief_justice_dhiraj_singh-_thakur_visited_tirumala
Etv Bharatap_high_court_chief_justice_dhiraj_singh-_thakur_visited_tirumala

By ETV Bharat Telugu Team

Published : Oct 28, 2023, 12:48 PM IST

AP High Court Chief Justice Dhiraj Singh Thakur visited Tirumala: తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తులు తరలివస్తున్నారు. దసరా శరన్నావరాత్రుల అనంతరం కూడా భక్తులు తిరుపతి అధికంగానే తరలివస్తున్నారు. అయితే స్వామివారిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ శ్యామ్ సుందర్ దర్శించుకున్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 24గంటల సమయం పడుతోంది.

స్వామివారిని దర్శించుకున్న ఏపీ హైకోర్టు సీజే: తిరుమల శ్రీవారిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ శనివారం రోజున దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆయన వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. అంతకు ముందు ఆలయం వద్దకు చేరుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దంపతులకు.. టీటీడీ జేఈవో వీరబ్రహ్మం ఘనంగా స్వాగతం పలికారు. తర్వాత దర్శన ఏర్పాట్లను పూర్తిచేయగా.. గర్భాలయంలో స్వామివారిని ఏపీ హైకోర్టు సీజే దర్శించుకునున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దంపతులకు పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఆ తర్వాత శ్రీవారి చిత్రపటంతో పాటు.. తీర్థప్రసాదాలను జేఈవో వీరబ్రహ్మం అందజేశారు.

TTD Alert : భక్తులకు అలర్ట్.. తిరుమల వెళ్తున్నారా? ఈ విషయం తెలియకుంటే ఇబ్బంది పడతారు!

శ్రీవారిని దర్శించుకున్న ఏపీ హైకోర్టు న్యాయమూర్తి: తిరుమల శ్రీవారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్యామ్ సుందర్ దర్శించుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను పూర్తి చేశారు. దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

టీటీడీ ఆలయ తలుపులు మూసివేత:పాక్షికచంద్రగ్రహణం సందర్భంగా శనివారం శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది . దాదాపు 8 గంటలపాటు చంద్రగ్రహణం కారణంగా ఆలయ తలుపులు మూసివేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. గ్రహణ సమయానికి 6 గంటల ముందు తలుపులు మూసివేయడం ఆనవాయితీ అని స్పష్టం చేశారు. రాత్రి 7.05 గంటలకు ఆలయ తలుపులు మూసివేయనున్నట్లు.. తిరిగి ఆదివారం తెల్లవారుజామున 3.15 గం.కు ఆలయ తలుపులు తెరుచోకునున్నట్లు అధికారులు వివరించారు. సంప్రోక్షణ అనంతరం స్వామివారి సేవలు యథావిధిగా కొనసాగుతాయని అధికారులు తెలిపారు.

Lunar Eclipse 2023 : ఈ నెలలోనే చంద్రగ్రహణం.. మన దేశంలో ఎక్కడ కనిపిస్తుందో తెలుసా..?

స్వామివారి సర్వదర్శనానికి 24 గంటల సమయం:తిరుమల స్వామివారి సర్వ దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24గంటల సమయం పడుతోంది. అంతేకాకుండా శ్రీవారి దర్శనం కోసం భక్తులు 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. శుక్రవారం రోజున దాదాపు 63 వేల 404 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అంతేకాకుండా 26వేల 659 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. శుక్రవారం ఒక్కరోజే శ్రీవారి హూండీ ఆదాయం 3.42 కోట్ల రూపాయలని ఆలాయాధికారులు వివరించారు.

శ్రీశైలం ఆలయం మూసివేత:చంద్రగ్రహణం కారణంగా రాష్ట్రంలోని పలు ఆలయాలను మూసివేయనున్నారు. శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయ ద్వారాలను సాయంత్రం 5గంటలకు మూసివేయనున్నట్లు ఆలాయాధికారులు వివరించారు. చంద్రగ్రహణం సందర్భంగా మధ్నాహ్నం 3గంటల వరకే భక్తులను దర్శనానికి అనుమతించనున్నట్లు వివరించారు. తిరిగి ఆలయ ద్వారాలు ఆదివారం ఉదయం 7గంటలకు సంప్రోక్షణ అనంతరం తెరుచుకోనున్నట్లు అధికారులు వివరించారు. ఆ తర్వతా ఆర్జిత సేవలు, భక్తుల దర్శనాలకు అనమతి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

Allegations on Srisailam Devasthanam EO Lavanna: బదిలీ చేసినా... అదే దేవాలయంలో పాతుకు పోతానంటున్న ఈవో

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details