తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇందుకే 'ఏపీ హేట్స్ జగన్' - నవరత్నాల పేరుతో 'నవ అరాచకాలు' - Cm jagan news

AP HATES JAGAN: ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అరాచక పాలనపై రాష్ట్ర వ్యాప్తంగా సుదీర్ఘ చర్చ జరుగుతోంది. నాలుగున్నరేళ్ల పరిపాలనలో రాష్ట్రాన్ని అభివృద్ది చేయకుండా.. 'నవ రత్నాల' పేరుతో 'నవ అరాచకాలు' సృష్టించారని ప్రజలు ధ్వజమెత్తుతున్నారు. ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన జగన్ పాలన.. అక్రమ అరెస్టులతో అన్నపూర్ణగా ప్రసిద్దిగాంచిన ఆంధ్రప్రదేశ్‌ను-అరాచకాంధ్రప్రదేశ్‌గా మార్చేశారని విమర్శలు గుప్పిస్తున్నారు.

ap_hates_jagan_nine_anarchies
ap_hates_jagan_nine_anarchies

By ETV Bharat Telugu Team

Published : Nov 15, 2023, 3:44 PM IST

AP HATES JAGAN: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజు నుంచి ఈరోజు దాకా జరిగిన పరిణామాలు, విధ్వంసాలు, అరాచకాలు, దాడులు, దౌర్జన్యాలను పరిశీలిస్తే విస్మయం కలుగుతుంది. రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ది చేయాల్సిన ముఖ్యమంత్రి, మంత్రివర్గం.. గత నాలుగున్నరేళ్లుగా ప్రతిపక్షాలపై కక్ష సాధింపులు, దళితులపై దాడులు, ఇసుక దందాలు, భూకబ్జాలకు పాల్పడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ను అరాచకాంధ్రప్రదేశ్‌గా మార్చేశారు. ఈ నాలుగున్నరేళ్ల వైసీపీ పాలన వైఫల్యాలను ఒకసారి పరిశీలిస్తే ప్రధానంగా.. తొమ్మది రకాల అరాచకాలు ('నవ అరాచకాలు') దేశ, రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. అందులో.. 1. ప్రజావేదిక విధ్వంసం 2. మూడు ముక్కల రాజధాని 3. అన్న క్యాంటీన్ రద్దు 4. పడకేసిన పోలవరం ప్రాజెక్ట్ పనులు 5. అక్రమ ఇసుక దోపిడీ 6. దొంగ ఓట్లు 7. దళితులపై దాడులు 8. అక్రమ అరెస్టులు 9. సీపీఎస్ రద్దంటూ మోసం.

సీఎం జగన్ 'నవ అరాచకాలు':రాష్ట్ర ముఖ్యమంత్రిగా.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (30 మే 2019) ప్రమాణం స్వీకారం చేసి.. ఇప్పటికీ నాలుగేళ్ల ఎనిమిది నెలలు పూర్తి అయ్యింది. ఈ నాలుగేళ్ల ఎనిమిది నెలల కాలంలో ముఖ్యమంత్రి హోదాలో జగన్ మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి పనులు ఏమైనా ఉన్నాయా..? అంటే అన్ని అరాచకాలు, విధ్వంసాలు, దాడులు తప్ప మరేమీ కనిపించటం లేదు. జగన్ ఆదేశాల మేరకు జరిగిన 'నవ అరాచకాల'ను ఒక్కొక్కటిగా పరిశీలిస్తే.. జగన్ అరాచక పాలన ఏ విధంగా సాగిందో స్పష్టంగా అర్ధమవుతుంది.

Anti Democratic Acts in CM Jagan Government: రాష్ట్రంలో జగనన్న రాజ్యాంగం వర్సెస్ భారత రాజ్యాంగం!.. ప్రజాస్వామిక హక్కులపై జగన్ ఉక్కుపాదం

1. ప్రజావేదిక విధ్వంసం.. సీఎం జగన్ పరిపాలన టీడీపీ ప్రజావేదిక కూల్చివేత (25 జూన్ 2019)తో ప్రారంభమైంది. 'మేము అధికారంలోకి వస్తే అక్ర‌మ క‌ట్ట‌డాలను కూల్చివేస్తాం. అది ప్ర‌జావేదిక భ‌వ‌నంతోనే మొద‌లుపెడుతున్నాం. ప్ర‌జావేదిక‌లో ఇదే చివ‌రి క‌లెక్ట‌ర్ల స‌మావేశం. త్వరలోనే ఈ భ‌వ‌నాన్ని కూల్చివేస్తాం' అంటూ ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. ఆ ప్రకారమే సీఆర్డీయే అధికారులు, జేసీబీలు, కూలీల ద్వారా ప్రజావేదిక భవనాన్ని కూల్చేసి.. జగన్ తన అరాచక పాలనను ఆరంభించారు.

2. మూడు ముక్కల రాజధాని..వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేటికీ రాష్ట్రానికి రాజధాని అంటూ లేకుండా పోయింది. 'ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధాని నగరాలు ఏర్పాటు చేయబోతున్నాం. రాష్ట్ర మంత్రి మండలి ఆమోదంతో అభివృద్ధి వికేంద్రీకరణ, సమ్మిళిత అభివృద్ధి బిల్లును ప్రవేశపెట్టం (2020). దానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. విశాఖపట్ణణాన్ని పరిపాలన, అమరావతిని శాసన, కర్నూలును న్యాయ రాజధానులుగా చేయబోతున్నాం' అంటూ ముఖ్యమంత్రిజగన్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. కానీ, నాలుగున్నరేళ్లు దాటినా ఇప్పటికీ రాజధానుల పేరుతో ముఖ్యమంత్రి జగన్ మూడు ముక్కలాట ఆడుతున్నారు.

Students Future Does Not Care Jagan Government: రాష్ట్రం, యువత భవిష్యత్తు నాశనమైతే నాకేంటి?.. చంద్రబాబుపై పగ సాధించడమే లక్ష్యం!

3. అన్న క్యాంటీన్ రద్దు.. గ్రామీణ ప్రాంతాల నుంచి వివిధ పనుల నిమిత్తం పట్టణాలకు వచ్చే పేదలు.. ఆకలితో తిరిగి వెళ్లకుండా వారికి పట్టెడన్నం పెట్టాలన్న ఉద్దేశంతో టీడీపీ ప్రభుత్వం 5 రూపాయలకే భోజనం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసింది. 2019లో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్.. ఆగస్ట్ 01, 2019 నుంచి అన్న క్యాంటీన్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించి.. లక్షలాది పేద, కార్మికుల పొట్టపై కొట్టారు.

4. పడకేసిన పోలవరం..సీఎం జగన్ అధికారం చేపట్టిన తర్వాత 2021లో జరిగిన అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుతూ..' పోలవరం ప్రాజెక్ట్ పనులు మొదలైపోయాయి. ప్రాజెక్ట్‌ను 2021 జూన్ నాటికి పూర్తి చేసి, నీళ్లు ఇస్తామని కచ్చితంగా చెప్తున్నాం' అంటూ ఉదరగొట్టారు. కానీ, ఇప్పటివరకూ పనులు కాదు కదా.. దాని ఊసే ఎత్తడం లేదు.

5. ఇసుక దోపిడీ.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో వైసీపీ నేతల అక్రమ దందాలు, ఇసకు దోపిడీలకు అడ్డూ అదుపే లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా ఇసుక కనిపించినా యథేచ్ఛగా దోపిడీ చేసేస్తున్నారు. న్యాయస్థానాల తీర్పులను పట్టించుకోకుండా.. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు కోట్లాది రూపాయలు తమ జేబుల్లోకి వేసుకుంటున్నారు.

6. దొంగ ఓట్లు.. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితాల్లో భారీగా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటివరకు 26 జిల్లాల్లో దాదాపు 15 లక్షలకుపైగా దొంగ ఓట్లు వెలుగు చూశాయి. టీడీపీ సానుభూతి ఓట్లను తొలగించడమే లక్ష్యంగా జగన్ ప్రభుత్వం.. గ్రామాల్లో వాలంటీర్లు, సచివాలయాల ద్వారా ముందుకు సాగుతోంది. అడ్రస్ లేని, జనాభా లెక్కలో లేని వారిని ఓటర్ల జాబితాల్లో చేర్చుతూ.. లక్షల దొంగ ఓట్లను సృష్టిస్తున్నారు.

7. దళితులపై దాడులు..రాష్ట్రంలో ఎక్కడ బహిరంగ ఏర్పాటు చేసిన 'నా ఎస్సీ, నా ఎస్టీలు' అంటూ ఉదరగొట్టే ముఖ్యమంత్రి జగన్.. తాజాగా భూ ఆక్రమణలపై ఫిర్యాదు చేసినందుకు దళిత న్యాయవాదిపై దాడి, కంచికచర్లలో మంచినీళ్లు అడిగిన దళిత యువకుడిపై మూత్రం పోసి అమానుషంగా ప్రవర్తన, రోడ్డుకు అడ్డంగా పెట్టిన ద్విచక్రవాహనాన్ని తీయాలంటూ హారన్‌ మోగించిన డ్రైవర్‌పై విచక్షణారహితంగా దాడులు జరిగిన నోరు విప్పలేదు. అంటే దళితులపై ఎన్ని దాడులు జరిగిన ముఖ్యమంత్రికి బాధ్యత ఉండదా..?, వైసీపీ మూకలపై చర్యలు తీసుకోరా..? అంటూ దళితులు నిలదీస్తున్నా జగన్‌లో ఎటువంటి చలనం లేదు.

8. అక్రమ అరెస్టులు..ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి జగన్ పరిపాలన ఎలా ఉందంటే.. నాలుగున్నరేళ్ల కాలంలో ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని ప్రశ్నిస్తే అరెస్టులు, ప్రాజెక్టుల విషయంలో జరుగుతున్న విధ్వంసాన్ని ఎత్తిచూపితే అరెస్టులు, వైసీపీ నేతల అరాచకాలపై ధర్నాలు చేస్తే అరెస్టులు, గత ప్రభుత్వ హయాంలో అవినీతి జరగకపోయినా.. అవినీతి జరిగిందంటూ రాత్రికి రాత్రే అరెస్టులు చేస్తున్న ఉదంతాలు కోకొల్లలుగా దర్శనమిస్తున్నాయి. అరాచకాలు సృష్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోకుండా..బాధితులను అరెస్టులు చేసిన సంఘటనలు జగన్ పాలనకు అద్దం పడుతున్నాయి.

9. సీపీఎస్ రద్దంటూ మోసం..నాలుగేన్నరేళ్ల వైసీపీ పాలనలో ప్రతిపక్షాలు, దళితులు, పేదలే కాదు ప్రభుత్వ ఉద్యోగులు సైతం నానా ఇబ్బందులు పడుతున్నారు. తాము అధికారంలోకి వస్తే ఉద్యోగులను అన్ని విధాలా ఆదుకుంటామని ప్రగల్భాలు పలికిన జగన్.. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రిబ్యూటరీ పింఛన్‌ పథకం(సీపీఎస్‌) రద్దు చేసి, దాని స్థానంలో గ్యారెంటీ పింఛన్‌ పథకం(జీపీఎస్‌)ను తీసుకొచ్చి.. ఉద్యోగులను దారుణంగా మోసం చేశారు. ఇలా చెప్పుకుంటుపోతే ఒకటేమిటీ ముఖ్యమంత్రి హోదాలో జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాలకు అంతే లేదు.

Twitter Posts on Chandrababu Naidu Arrest : ఈ అరాచకాలు.. ఎన్నాళ్లు.. ఇంకెన్నాళ్లు.. మౌనం వెనక ప్రళయం ఉంది.. గుర్తుపెట్టుకో జగన్

ABOUT THE AUTHOR

...view details