తెలంగాణ

telangana

ETV Bharat / bharat

AP Ex DGP Son Controversy : అమ్మాయి విషయంలో ఘర్షణ.. వివాదంలో ఏపీ మాజీ డీజీపీ కుమారుడు - పబ్‌లో దాడి మాజీ డీజీపీ కుమారుడు డేవిడ్‌ సవాంగ్‌

AP Ex DGP Son Controversy : హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో ఓ యువతి విషయంలో.. రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆంధ్రప్రదేశ్‌ మాజీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ కుమారుడు డేవిడ్‌ సవాంగ్‌ ఉన్నట్లు తెలుస్తోంది.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Telugu Team

Published : Sep 14, 2023, 10:53 AM IST

Updated : Sep 14, 2023, 7:16 PM IST

AP Ex DGP Son Controversy :AP Ex DGP Son Controversy : హైదరాబాద్​లోని జూబ్లీహిల్స్​ రోడ్డు నంబర్​ 10లో గల 0-40 పబ్బు వద్ద జరిగిన దాడి కేసులో ఇరువర్గాలపై కేసు(Clash Between Two groups) నమోదైంది. పబ్​ సమీపంలో యువకులు సమద్​, సిద్ధార్థ వర్గాల మధ్య యువతి విషయంలో గొడవ జరిగింది. సమద్​ వర్గంలో ఆంధ్రప్రదేశ్​ మాజీ డీజీపీ గౌతం సవాంగ్(Ex AP DGP Gowtham Sawang)​ కుమారుడు డేవిడ్​ సవాంగ్(David Sawang)​ ఉన్నాడు.

సమద్​ డేవిడ్​ సవాంగ్​ స్నేహితుడు కావడం గమనార్హం. గతంలో పలు సందర్భాల్లో ఇరువర్గాల మధ్య వాగ్వాదం కూడా జరిగినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. అయితే బుధవారం రాత్రి ఇరువర్గాలు పబ్​ బయట దాడులకు దిగాయి. ఘటనలో సిద్ధార్థకు గాయాలయ్యాయి. దీనిపై ఇరువర్గాలు పరస్పరం జూబ్లీహిల్స్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసుకున్నాయి. దీంతో పోలీసులు ఇరువర్గాల ఫిర్యాదులను పరిశీలించారు. ఆపై ఇరుపక్షాలపై కేసును నమోదు చేశారు.

Jagtial Deepthi Murder Case Update : సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ దీప్తి మర్డర్​ కేసు.. పోలీసుల అదుపులో చందన..?

అసలేం జరిగింది :హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్‌ 10లో ఓ పబ్‌ ఎదుట బుధవారం రాత్రి ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఓ యువతి విషయంలో రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఇందులో పాల్గొన్న ఓ వర్గంలో సిద్ధార్థ మాగ్నమ్ ఉండగా.. మరో వర్గంలో ఏపీ మాజీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ కుమారుడు డేవిడ్‌ సవాంగ్‌ ఉన్నట్లు సమాచారం. పబ్‌లో వీరి మధ్య గొడవ తలెత్తినట్లు తెలుస్తోంది.

Two Groups attack: దంపతుల పంచాయితీ.. ప్రాణాలు తీసిన ఇరువర్గాల ఘర్షణ

Gautham Sawang Son Involves in A Fight For Girl Hyderabad : కాసేపటి తర్వాత బయటకు వచ్చి మద్యం మత్తులో ఇరు వర్గాలు పరస్పరం దాడులకు దిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో సిద్ధార్థ, డేవిడ్‌కు గాయాలయ్యాయి. దీనిపై సమాచారం అందడంతో జూబ్లీహిల్స్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Two Young Men Fight for Young Woman in Madapur : ఈ నేపథ్యంలోనే పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ విషయంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని జూబ్లీహిల్స్‌ సీఐ రవీంద్ర తెలిపారు. ఫిర్యాదు వస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఘర్షణకు సంబంధించి సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నామని ఆయన వివరించారు. సీసీ ఫుటేజీ పరిశీలించిన పోలీసులు.. గొడవకు దిగిన వారిని గుర్తించారు. ఈలోపు వారే పోలీస్​ స్టేషన్​కు వచ్చి ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. దీంతో పోలీసులు ఆ రెండు వర్గాలపై కేసులు నమోదు చేశాయి.

10th Class Girl Suicide in Nizamabad : పదో తరగతి బాలిక ఆత్మహత్య.. ప్రేమించి మోసపోయానంటూ సూసైడ్ నోట్

భూవివాదంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ, 10 మందికి గాయాలు

Last Updated : Sep 14, 2023, 7:16 PM IST

ABOUT THE AUTHOR

...view details