తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చంద్రబాబు బెయిల్‌ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు సీఐడీ - తెలుగుదేశం అధినేత చంద్రబాబు

AP CID to move Supreme Court
AP CID to move Supreme Court

By ETV Bharat Telugu Team

Published : Nov 21, 2023, 4:17 PM IST

Updated : Nov 21, 2023, 6:17 PM IST

16:13 November 21

స్కిల్ కేసులో చంద్రబాబుకు హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో సీఐడీ పిటిషన్‌

AP CID to move Supreme Court on Chandrababu bail: స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంపై... ఏపీ సీఐడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బెయిల్‌ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సీఐడీ సుప్రీంలో సవాల్‌ చేస్తూ పిటిషన్‌ దాఖలు చేసింది.ఈ మేరకు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినట్లు ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తెలిపారు. హైకోర్టు తీర్పు న్యాయసమ్మతం, చట్టసమ్మతం కాదన్న పొన్నవోలు... చంద్రబాబుకు బెయిల్ ఇవ్వడం దురదృష్టకరమని ఆక్షేపించారు. స్కిల్ కేసులో ఆర్థిక అవకతవకలపై తగిన సాక్ష్యాధారాలు సమర్పించినా హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదన్నారు. అందుకే సుప్రీంకోర్టును ఆశ్రయించామని ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తెలిపారు.

నైపుణ్యాభివృద్ధి సంస్థ కేసులో చంద్రబాబుకు సోమవారం హైకోర్టు బెయిలు మంజూరు చేసింది. చంద్రబాబు, టీడీపీ ఖాతాలకు నిధులను మళ్లించారనేందుకు సీఐడీ ఎలాంటి ప్రాథమిక ఆధారాలూ సమర్పించలేకపోయిందని.. ఇప్పటికే హైకోర్టు తేల్చిచెప్పింది. ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నప్పుడు చంద్రబాబుకు రిమాండ్‌ విధించాలని అభ్యర్థించక ముందే తగిన ఆధారాలను సేకరించి ఉండాల్సిందని అభిప్రాయపడింది. నిధులు టీడీపీ ఖాతాలోకి చేరాయనేందుకు దర్యాప్తు సంస్థ వద్ద ఆధారాలేవీ లేవని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని దర్యాప్తు లోపంగా భావిస్తున్నామని పేర్కొంది. ఇప్పటికే సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై తీర్పు పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే.

Last Updated : Nov 21, 2023, 6:17 PM IST

ABOUT THE AUTHOR

...view details