AP CID Officials at Kolikapudi Srinivasa Rao House:ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు వచ్చారు. రాంగోపాల్ వర్మ ఫిర్యాదు నేపథ్యంలో శ్రీనివాసరావును అరెస్ట్ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. హైదరాబాద్ వెళ్లిన ఏపీ సీఐడీ అధికారులు నల్లగండ్లలోని అపర్ణ సైబర్ లైఫ్ గేటెడ్ కమ్యూనిటీలోని కొలికపూడి ఇంటికి వచ్చినట్లు సమాచారం. కొలికపూడిని అరెస్టు చేసేందుకే సీఐడీ బృందం హైదరాబాద్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆయన ఇంట్లో లేకపోవడంతో కొలికపూడి భార్యను ఆఫీసు నుంచి ఇంటికి రావాలని కోరారు. ఆ తరువాత సీఐడీ అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. రెండు రోజుల క్రితం కొలికపూడి శ్రీనివాసరావు తనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
AP CID Notices to Kolikipudi Srinivasa Rao Wife Madhavi:ఏపీ సీఐడీ అధికారులు కొలికిపూడి శ్రీనివాసరావు సతీమణి మాధవికి నోటీసులు అందజేశారు. వచ్చె నెల 3వ తేదీన గుంటూరు సీఐడీ కార్యాలయంలో హాజరుకావాలంటూ నోటీసులో పేర్కొన్నారు. దర్శకుడు రాంగోపాల్‌వర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరుకు సీఐడీ పోలీసులు శ్రీనివాసరావుపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆర్జీవీ ప్రాణభయంతో తమకు ఫిర్యాదు చేశారని అందులో భాగంగానే కేసు నమోదు చేశామని ఏపీ సీఐడీ పోలీసులు పేర్కొన్నారని మాధవి తెలిపారు.
6 గంటల విచారణ తర్వాత సాఫ్ట్వేర్ రామును వదిలిపెట్టిన సీఐడీ - 28న రావాలని నోటీసులు
Kolikapudi Srinivasa Rao Comments on RGV:కొద్ది రోజుల క్రితం కొలికపూడి శ్రీనివాసరావు ఓ ఛానల్‌లో ఓ చర్చా కార్యక్రమం నిర్వహించగా అందులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాంకర్ అడిగిన ప్రశ్నలకు కొలికపూడి సమాధానాలు చెప్తూ 'రామ్‌గోపాల్ వర్మ తల నరికి తెస్తే కోటి రూపాయలు ఇస్తా’ అంటూ ఛాలెంజ్ చేశారు. వెంటనే షోలో ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదని చట్ట ప్రకారమే మాట్లాడాలని, అలానే కొలికపూడి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని అడిగినా వినకుండా ‘'ఐ రిపీట్, ఐ రిపీట్ నాకు సమాజం కంటే ఏదీ ఎక్కువ కాదు'’ అంటూ కొలికపూడి రెచ్చిపోయారు.