తెలంగాణ

telangana

ETV Bharat / bharat

AP CID arrested TDP Chief Chandrababu: అత్యంత నాటకీయ పరిణామాల మధ్య చంద్రబాబు అరెస్ట్..! కోర్టులో హజరు పర్చడంలో హైడ్రామా..! - TDP Cheif Chandrababu arrest news

AP CID officials arrested Telugu Desam Chief Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్​పై ఆ పార్టీ భగ్గుమంది. చంద్రబాబు అరెస్ట్​ను నిరసిస్తూ.. ఏపీ వ్యాప్తంగా ఆ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని మహిళా నేతలు, కార్యకర్తలు రోడ్లపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

AP_CID_officials_arrested_tdp_Chief_Chandrababu
AP_CID_officials_arrested_tdp_Chief_Chandrababu

By ETV Bharat Telugu Team

Published : Sep 9, 2023, 11:00 PM IST

Updated : Sep 10, 2023, 6:34 AM IST

AP CID officials arrested Telugu Desam Chief Chandrababu: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని.. ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు శనివారం నాడు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. స్కిల్ డెవలప్​మెంట్ ప్రాజెక్టులో ఆరోపణలు రావడంతో చంద్రబాబును అరెస్టు చేసినట్లు సీఐడీ అధికారులు ప్రకటించారు. అయితే, చంద్రబాబు నాయుడిపై సీఐడీ అధికారులు ఏయే సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు..?, అరెస్డ్ చేసినప్పటీ నుంచి ఇప్పటిదాకా ఆయనను ఏయే ప్రాంతాలకు తీసుకెళ్లారు..?, ఎన్ని గంటల నుంచి సీఐడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు..? అనే వివరాలను పూర్తిగా తెలుసుకుందాం.

CID Arrested Chandrababu in Nandyala..టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 'బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ' కార్యక్రమంలో భాగంగా ఆయన శుక్రవారం నంద్యాల జిల్లాలో పర్యటించారు. అనంతరం రాజ్ థియేటర్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఆ తర్వాత ఆయన బస చేసిన ఆర్.కె. ఫంక్షన్ హాల్ వద్ద సీఐడీ అధికారులు చంద్రబాబును అరెస్ట్ చేశారు. అనంతరం రోడ్డుమార్గంలో చంద్రబాబును విజయవాడకు తరలించారు. ఈ క్రమంలో ప్రాథమిక ఆధారాలు లేకుండా, ఎఫ్ఐఆర్​ (FIR)లో పేరు లేకుండా ఎలా అరెస్టు చేస్తారని.. పోలీసులను చంద్రబాబు ప్రశ్నించారు. చట్టాలతో పని లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారా..? అంటూ మండిపడ్డారు.

Chandrababu on CM Jagan in Nandyala టీడీపీ అధికారంలోకి వచ్చాక కరెంట్‌ ఛార్జీలు పెంచం.. అవసరమైతే తగ్గిస్తాం: చంద్రబాబు

CID Registered a Case Against Chandrababu Under Various Sections.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన సీఐడీ అధికారులు.. స్కిల్ డెవలప్​మెంట్ కేసులో 120B, 166, 167, 418, 420, 465, 468, 471, 409, 201, 109 రెడ్ విత్ 34, 37 I.P.C, 12, 13(2) రెడ్ విత్ 13 (1)(C)(D) ప్రివన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు అరెస్టు నోటీసుల్లో వెల్లడించారు. ఆ తర్వాత ఉదయం ఐదున్నర గంటలకు.. వైద్య పరీక్షలు నిర్వహించి.. నంద్యాల నుంచి రోడ్డు మార్గంలో విజయవాడకు తరలించారు.

Chandrababu Comments..చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ''నేను ఏ తప్పూ చేయలేదు. ప్రజా సమస్యలపై పోరాడుతుంటే అణిచివేస్తున్నారు. అర్ధరాత్రి వచ్చి పోలీసులు భయభ్రాంతులకు గురిచేశారు. నేనేం తప్పు చేశాను..?, ఆధారాలేవీ అని అడిగా.. ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పాల్సిన బాధ్యత లేదా..? ఏ తప్పు చేశానో చెప్పకుండా అరెస్టు చేస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాడకుండా ప్రణాళిక ప్రకారం అరెస్టు చేస్తున్నారు. 45ఏళ్లుగా నిస్వార్థంగా సేవ చేస్తున్నాను. తెలుగువారి ప్రయోజనాల కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధపడ్డాను. తెలుగు ప్రజలు, మాతృభూమికి సేవ చేయకుండా నన్ను ఏ శక్తి ఆపలేదు." అని ఆయన అన్నారు.

TDP Workers Fire on Chandrababu Arrest..చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేసిందన్న విషయం తెలుసుకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు నంద్యాల జిల్లాకు పెద్దఎత్తున చేరుకున్నారు. దీంతో కుంచన్‌పల్లి వరకూ అడుగడుగునా తెలుగుదేశం శ్రేణులు అడ్డుపడడంతో చంద్రబాబును తరలిస్తున్న కాన్వాయ్‌.. ముందుకు కదలడం చాలా కష్టమైంది. భారీగా పోలీసులను మోహరించినా, బారికేడ్లు పెట్టినా, లాఠీలు ఝులిపించినా.. కాన్వాయ్‌ను ముందుకు కదలేదు. పసుపు దండు ఎక్కడికక్కడ అడ్డుకుంది.ఈ నేపథ్యంలో చిలకలూరిపేటలో స్వయంగా చంద్రబాబే కారు దిగి విజ్ఞప్తి చేస్తేగాని కాన్వాయ్‌ కదల్లేదు. ఒంగోలులో కార్యకర్తలంతా ఒక్కసారి రోడ్డుపైకి వచ్చి.. వాహన శ్రేణిని అడ్డగించారు. పోలీసులు ఎంత చెప్పినా వినకుండా.. జాతీయ రహదారిపై బైఠాయించి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. పర్చూరు నియోజకవర్గం పంగులూరులోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

SIT team investigating Chandrababu తాడేపల్లి సిట్‌ కార్యాలయంలో చంద్రబాబు.. 5 గంటలైనా అంతుచిక్కని సీఐడీ అధికారుల వ్యూహం!

Chandrababu Move to Tadepalli Seat Office.. అద్దంకి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్​ను నిరసిస్తూ..తెలుగుదేశం శ్రేణులు ముప్పవరంలో ధర్నాకు దిగారు. చంద్రబాబును తరలిస్తున్న కాన్వాయ్​ని నిలిపివేశారు. దీంతో కార్యకర్తలను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ఇక, చిలకలూరిపేటలో మాత్రం తెలుగుదేశం కార్యకర్తల ఆగ్రహానికి.. కాన్వాయ్‌ అరగంటకుపైగా ఆగిపోయింది. జాతీయ రహదారిపై నేతలు, మహిళలు బైఠాయించారు. దీంతో కాన్వాయ్ దిగివచ్చి దారి ఇవ్వాలని కార్యకర్తలకు.. చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. అనంతరం గుంటూరు జిల్లా నుంచి తాడేపల్లి సిట్ కార్యాలయానికి చంద్రబాబు నాయుడిని అధికారులు తీసుకువచ్చారు. సిట్ కార్యాలయంలో గత 5 గంటలుగా చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు.

CBI Former Director Nageswara Rao on CBN Arrest గవర్నర్ అనుమతి లేకుండా చంద్రబాబును అరెస్టు చేయడం చట్టవిరుద్ధం: సీబీఐ మాజీ డైరెక్టర్

Last Updated : Sep 10, 2023, 6:34 AM IST

ABOUT THE AUTHOR

...view details