Contempt of Court in Margadarsi Case : మార్గదర్శి చిట్ ఫండ్స్‌కు సంబంధించిన కోర్టు ధిక్కరణ కేసుల్లో ఏపీ సీఐడీ అధికారులు తెలంగాణ హైకోర్టులో హాజరయ్యారు. దర్యాప్తు కోసం పరిస్థితులను బట్టి మార్గదర్శి ఎండీపై లుకౌట్ సర్కులర్ ఇవ్వాల్సి వచ్చిందన్న సీఐడీ అధికారుల వాదనపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. పరిస్థితులు ఏమైనప్పటికీ.. కోర్టు ఆదేశాలు ఉన్నాయి కదా అని వ్యాఖ్యానించింది.
AP CID Officers Attend to Telangana High Court: మార్గదర్శి కేసు.. ఏపీ సీఐడీ అధికారులపై తెలంగాణ హైకోర్టు అసహనం
Additional SPs of AP CID attended the Margadarsi case: మార్గదర్శి చిట్ ఫండ్స్ కు సంబంధించిన కోర్టు ధిక్కరణ కేసుల్లో ఏపీ సీఐడీ అధికారులు తెలంగాణ హైకోర్టులో హాజరయ్యారు. దర్యాప్తు కోసం పరిస్థితులను బట్టి మార్గదర్శి ఎండీపై లుకౌట్ సర్కులర్ ఇవ్వాల్సి వచ్చిందన్న సీఐడీ అధికారుల వాదనపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. పరిస్థితులు ఏమైనప్పటికీ.. కోర్టు ఆదేశాలు ఉన్నాయి కదా అని వ్యాఖ్యానించింది.
మార్గదర్శి చిట్ ఫండ్స్(Margadarsi Chit Funds) ఆ కంపెనీ ఎండీ శైలజా కిరణ్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. కఠిన చర్యలు తీసుకోవద్దని మార్చి 21న హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఉల్లంఘించి.. వెయ్యి 35 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు అటాచ్ చేశారన్న మార్గదర్శి చిట్‌ఫండ్స్ పిటిషన్ పై.. విచారణ జరిగింది. ఆస్తుల అటాచ్ కూడా కఠినచర్యే కాబట్టి... ఆ ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తాపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని, పిటిషన్‌లో మార్గదర్శి చిట్‌ఫండ్స్ కోరింది. అదేవిధంగా హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేసినందున... ఏపీ సీఐడీ అదనపు డీజీ ఎన్.సంజయ్, అదనపు ఎస్పీలు ఎస్.రాజశేఖర్ రావు, సీహెచ్.రవికుమార్‌పై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలన్న మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ పిటిషన్ పైనా విచారణ జరిగింది.
కోర్టు ధిక్కరణ పిటిషన్లపై విచారణకు ఏపీ సీఐడీ అదనపు ఎస్పీలు(AP CID Additional SPs) ఎస్.రాజశేఖర్ రావు, సీహెచ్. రవికుమార్ తెలంగాణ హైకోర్టులో వ్యక్తిగతంగా హాజరయ్యారు. సీఐడీ అదనపు డీజీ ఎన్.సంజయ్‌కి గుండె ఆపరేషన్ జరిగినందున రాలేక పోయినట్టు, ఆయన తరఫు న్యాయవాది తెలిపారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా(Harish Kumar Gupta) అధికారిక కార్యక్రమాల్లో ఉన్నందున.. హాజరు కాలేకపోయారన్నారు. ఇద్దరు అధికారుల హాజరును నమోదు చేసిన తెలంగాణ హైకోర్టు.. తదుపరి విచారణకు హాజరు మినహాయింపు ఇచ్చింది. మిగతా ఇద్దరు అధికారులు తాము ఆదేశించినప్పుడు హాజరుకావాలని.. స్పష్టం చేసింది. దర్యాప్తులో భాగంగా పరిస్థితులను బట్టి మార్గదర్శిపై లుక్ అవుట్ సర్క్యులర్ ఇవ్వాల్సి వచ్చిందని.. ఏపీ సీఐడీ అధికారుల తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. పరిస్థితులు ఏమైనప్పటికీ కోర్టు ఆదేశాలు ఉన్నాయి కదా అని.. ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. వాదనలు వినిపించేందుకు న్యాయవాదులు సమయం కోరడంతో, ఈ పిటిషన్‌లపై విచారణ సెప్టెంబర్ 15 కు తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది.