తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'వందేళ్ల ఉత్సవం నాటికి దేశం ఫిట్​ ఇండియాగా మారాలి' - fit india news today

ఫిట్​ ఇండియా ఫ్రీడమ్​ రన్ 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించారు కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్. అక్టోబర్​ 2 వరకు ఈ ఫ్రీడమ్ రన్​ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

fit india, anurag thakur
ఫిట్ ఇండియా, అనురాగ్ ఠాకూర్

By

Published : Aug 13, 2021, 10:10 AM IST

దేశవ్యాప్తంగా ఫిట్​ ఇండియా ఫ్రీడమ్​ రన్​ 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించారు కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్. ఫిట్​గా ఉంటేనే దేశాన్ని ముందుకు తీసుకెళ్లగలమని అన్నారు. స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్లు అయ్యేనాటికి దేశం 'ఫిట్​ ఇండియా'గా మారాలని ఆకాంక్షించారు.

ప్రారంభమైన ఫిట్​ ఇండియా ఫ్రీడమ్ రన్

అనురాగ్ ఠాకూర్, నితీశ్ ప్రమానిక్.. దిల్లీలో జెండా ఊపి.. ఫిట్​ ఇండియా రన్​ను ప్రారంభించారు.

దిల్లీలో..

మహారాష్ట్రలో గేట్​ ఆఫ్​ ఇండియా వద్ద ఫిట్​ ఇండియా రన్​ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో 40 మంది ఎన్​ఎస్​జీ కమాండోలు రన్​లో పాల్గొన్నారు.

40 మంది ఎన్​ఎస్​జీ కమాండోలు
పరుగులు తీస్తున్న కమాండోలు

పంజాబ్​ అమృత్​సర్​లోని అతారి-వాఘా బార్డర్ వద్ద బీఎస్​ఎఫ్​ జవాన్లు ఫిట్​ ఇండియా రన్​ కార్యక్రమంలో పాల్గొన్నారు.

పంజాబ్​లో బీఎస్​ఎఫ్​ జవాన్లు

ఆజాదీ కా అమృత్​ మహోత్సవ్ సందర్భంగా ఫిట్​ ఇండియా 2.0ను ప్రారంభించినట్లు అనురాగ్​ ఠాకూర్ తెలిపారు. 75 ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని నేడు ప్రారంభించామని పేర్కొన్నారు. అక్టోబర్​ 2 వరకు ఫ్రీడమ్​ రన్​ నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:'ఫిట్​ ఇండియా.. ప్రజా ఉద్యమంలా మారాలి'

ABOUT THE AUTHOR

...view details