కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనీ తన పార్లమెంటరీ కెరీర్‌కు ముగింపు పలకనున్నట్లు సూచనలు అందించారు. ప్రస్తుతం పదవీ కాలం ముగియగానే మరో నామినేషన్‌కు దరఖాస్తు చేయనని స్పష్టం చేశారు. గురువారం ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు.
"వచ్చే ఏడాది నా పదవీ కాలం ముగియగానే కేరళకు తిరిగి రావాలనుకుంటున్నాను. రాష్ట్ర రాజకీయాలకు కూడా దూరంగా ఉంటాను. ఈ విషయాన్ని నేను 2004లోనే స్పష్టం చేశాను."