బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిసైల్ సిరీస్‌లోని నౌకా విధ్వంసక క్షిపణి(యాంటీ షిప్ మిసైల్)ని భారత నావికా దళం మంగళవారం పరీక్షించింది. అండమాన్-నికోబార్ దీవుల నుంచి ఈ ప్రయోగాన్ని నిర్వహించారు.
నౌకా విధ్వంసక క్షిపణి పరీక్ష విజయవంతం - భారత నావికా దళం
బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిసైల్ సిరీస్‌లోని నౌకా విధ్వంసక క్షిపణిని భారత నావికా దళం పరీక్షించింది. అండమాన్- నికోబార్ దీవుల నుంచి అధికారులు ఈ ప్రయోగాన్ని నిర్వహించారు.
ఇటీవల భూమి నుంచి భూమి మీద ఉన్న లక్ష్యాలను ఛేదించే బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణిని భారత సైన్యం విజయవంతంగా పరీక్షించింది. 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని క్షిపణి సులువుగా ఛేదించింది. ఈ క్షిపణిని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ) రూపొందించింది. ప్రపంచంలోనే అత్యధిక వేగంతో బ్రహ్మోస్ క్షిపణి లక్ష్యాన్ని ఛేదిస్తుంది. ఇటీవల క్షిపణి లక్ష్యాన్ని 298కి.మీ నుంచి 450కి.మీ వరకు డీఆర్డీఓ పెంచింది.
ఇదీ చదవండి:బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్షిపణి ప్రయోగం విజయవంతం