Boy Missing News: కేరళలో కొండ చీలికలో చిక్కుకున్న బాబు అనే యువకుడిని రక్షించిన కొన్ని గంటలకే అలాంటి సంఘటన మరోకటి వెలుగులోకి వచ్చింది. పాలక్కడ్లోని కంజిరపుజా పంపంతోడు అడవుల్లో ఓ గిరిజన యువకుడు.. దారితప్పిపోయాడు.
ప్రసాద్(21) తల్లిదండ్రులతో కలిసి పాలక్కడ్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు అతని తల్లిదండ్రులతో కలిసి అడవికి వెళ్లాడు ప్రసాద్. అటవీ ఉత్పత్తులను సేకరించిన తర్వాత తల్లిదండ్రులు ఇంటికి చేరారు. కానీ యువకుడు రాలేదు. ఆ రాత్రంతా ఎదురుచూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.