తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రైతు ఆందోళన: ముగ్గురు అన్నదాతలు మృతి - ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు

నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ దిల్లీ సరిహద్దుల్లో రైతన్నలు చేస్తోన్న ఆందోళనలో విషాదం నెలకొంది. ఆదివారం రాత్రి నుంచి ఇప్పటివరకు మొత్తం ముగ్గురు అన్నదాతలు ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఇద్దరు ఉరివేసుకుని చనిపోగా.. మరో రైతు గుండెపోటుతో మరణించాడు.

Another farmer returned from the Delhi Farmers agitation he hanged himself
దిల్లీ ఆందోళనల్లో ఉద్రిక్తత- ముగ్గురు రైతులు మృతి

By

Published : Jan 11, 2021, 12:37 PM IST

దిల్లీ సరిహద్దులో కొనసాగుతున్న రైతుల ఆందోళనలో మరో ముగ్గురు కర్షకులు కన్నుమూశారు. నిరసనల్లో పాల్గొంటున్న ఇద్దరు​ రైతులు ఒకేరోజు మరణించారు. అంతకమందు రోజు రాత్రి మరో అన్నదాత ఆత్మహత్య చేసుకున్నాడు.

శ్రీ ముక్త్​సర్​ సాహెబ్.. గుండెపోటుతో టిక్రీ సరిహద్దులో హఠాన్మరణం పొందగా.. బర్నాలా వాసి జగదీష్​ సింగ్​(61) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఆదివారం రాత్రి నిర్మల్​ సింగ్​ ఉరి వేసుకుని బలవన్మరణం పొందాడు. ఏక్తా డకోదా యూనియన్(పంజాబ్​)​లో నిర్మల్​ కీలక పాత్ర పోషించాడు.

నిర్మల్​ సింగ్​కు రైతు రుణం కింద రూ. రూ.5లక్షల అప్పుండగా.. ప్రభుత్వం దాన్ని రుణమాఫీ చేయాలని రైతు సంఘాలు కోరాయి. అంతేకాకుండా.. అతడికి పరిహారంతో పాటు, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని డిమాండ్​ చేశాయి.

ఇదీ చదవండి:కేంద్రంతో రైతుల 'కుస్తీ' మే సవాల్​

ABOUT THE AUTHOR

...view details