నూతన వ్యయసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలోని సింఘు సరిహద్దులో సాగుతున్న ఉద్యమంలో మరో అన్నదాత ప్రాణాలు కోల్పోయాడు. మృతిచెందిన రైతును పంజాబ్లోని ధాట్కు చెందిన జగ్జీత్సింగ్ అలియాస్ బబ్బూగా గుర్తించారు. గుండెపోటుతో అతను మరణించినట్లు తెలుస్తోంది.
రైతుల ఉద్యమంలో మరో అన్నదాత మృతి - సింఘు సరిహద్దులో రైతు మృతి
దిల్లీ సరిహద్దులో రైతులు చేస్తున్న ఆందోళనల్లో మరో కర్షకుడు ప్రాణాలు కోల్పోయాడు. సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు నిరసనల్లో పాల్గొంటున్న జగ్జీత్సింగ్ అనే రైతు.. గుండెపోటుతో మరణించాడు.
![రైతుల ఉద్యమంలో మరో అన్నదాత మృతి Another farmer martyred in the farmer agitation](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10320735-thumbnail-3x2-111.jpg)
రైతుల ఉద్యమంలో మరో అన్నదాత మృతి
జనవరి 14న రైతు ఉద్యమంలో పాల్గొనేందుకు దిల్లీ వచ్చాడు జగ్జీత్ సింగ్. అతడి మరణ వార్త తెలియగానే తన సొంతూరిలో రోదనలు మిన్నంటాయి.
ఇదీ చూడండి:దిల్లీ సరిహద్దుల్లో మరో రైతు ఆత్మహత్య