తాము పూజించే ఆలయంలోకి దళిత బాలుడు ప్రవేశించాడని అగ్రకులస్తులు జరిమానా విధించిన ఘటన మరవక ముందే మరో ఉదంతం వెలుగుచూసింది. కర్ణాటక(Karnataka News) కొప్పల్ జిల్లాలో తమ ఆలయంలోకి(Dalit Temple Entry) దళిత యువకుడు ప్రవేశించకుండా కొందరు అడ్డుకున్నారని ఆరోపణలొచ్చాయి. దీనిపై విచారణ చేపట్టి పోలీసులు.. నిందితులు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.
ఇదీ జరిగింది..
కొప్పల్‌లోని కరటగి తాలూకా నాగన్కల్ గ్రామంలో లక్ష్మీ దేవి ఆలయానికి ఓ వ్యక్తి వెళ్లాడు. అయితే అది అగ్రకులస్తులు మాత్రమే పూజించే ఆలయమని.. దళితులకు ప్రవేశం లేదని గుడి యాజమాన్యం అడ్డుకుంది(Dalit Denied Entry in Temple). అంతేగాక ఆ యువకుడికి రూ.11వేలు జరిమానా(Dalit Fined) విధించింది. సెప్టెంబర్ 16న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారానికి సంబంధించి పూజారి సహా.. ఆలయ నిర్వహణ సభ్యులు ఎనిమిది మందిపై కరటగి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. నిందితులు పరారీలో ఉన్నారని.. ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని ఎస్‌ఐ యల్లప్ప తెలిపారు.
విషయం తెలుసుకున్న సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు గ్రామాన్ని సందర్శించి బాధితుడితో మాట్లాడారు.
"గుడిలో ప్రవేశించిన దళితుడిని కొందరు అడ్డుకున్నట్లు ఆరోపణలొచ్చాయి. బాధితునికి రూ.11వేలు జరిమానా కూడా విధించారని తెలుస్తోంది. మొదట అగ్రకులస్తులకు భయపడిన బాధితుడు తాను దేవాలయానికి విరాళం ఇచ్చినట్లు అబద్దం చెప్పాడు. కానీ గ్రామస్థులతో మాట్లాడినప్పుడు.. ఆ డబ్బును జరిమానాగా చెల్లించాడని గుర్తిచాం. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన ఈ అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ".