ఏడాదిగా వాయిదా పడిన అమర్నాథ్ యాత్ర జూన్ 28న ప్రారంభమై.. ఆగస్టు 22న ముగుస్తుందని శ్రీ అమర్నాథ్ ఆలయ బోర్డు ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపింది. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు సంబంధించిన 446 బ్రాంచ్‌లు, జమ్ముకశ్మీర్ బ్యాంక్, యెస్ బ్యాంక్‌ల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది.
జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అధ్యక్షతన జరిగిన ఆలయ బోర్డు సమావేశంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.