Annakoot Festival In Rajasthan : అందరూ చూస్తుండగానే చాలా మంది వచ్చి ఆలయంలోని ప్రసాదాలను కుండలు, సంచులతో దోచుకెళ్లటం చూస్తున్నారు కదా! ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు చాలా మంది వచ్చి దేవుని దగ్గర పెట్టిన ప్రసాదాన్ని లూటీ చేస్తున్నారు. ఇలా చేయటాన్ని ఓ పండుగలాగా జరుపుకుంటున్నారు రాజస్థానీలు. దేవుని దగ్గర ప్రసాదాలు పెట్టడం.. అక్కడ గిరిజనలు వచ్చి లూటీ చేయటం ఇలా గత 350 ఏళ్లుగా జరుగుతూనే ఉంది. అదే రాజ్‌సమంద్‌లోని శ్రీనాథ్జీ ఆలయంలో జరిగే అన్నకూట్ పండుగ.
ఈ పండుగను రాజ్‌సమంద్ ప్రజలు దీపావళి తరవాత రోజున ఘనంగా నిర్వహించుకుంటారు. శ్రీనాథ్జీ, విఠల్‌నాథ్‌జీ, లాలన్‌కు భక్తులు వివిధ రకాల నైవేద్యాలను పెడతారు. వాటిని రాత్రి 11 గంటల సమయంలో రాజ్‌సమంద్ జిల్లా గిరిజనలు వచ్చి దోచుకుంటారు. వీటికోసం తమ ఇళ్ల నుంచి సంచులను తెచ్చుకుని.. బుట్టలు, కుండలలో ఉంచిన ప్రసాదాన్ని దోచుకుంటారు. అన్నకూట్ లూటీ సంప్రదాయాన్ని తిలకించేందుకు వివిధ రాష్ట్రాల నుంచి కుడా వందల సంఖ్యలో భక్తులు వస్తారని ఆలయ యువరాజ్ అన్నారు.