రైతు సమస్యలను పరిష్కరించకపోతే తాను మళ్లీ నిరాహార దీక్ష చేపడతానని కేంద్రాన్ని హెచ్చరించారు ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే. ఇందుకు ప్రభుత్వానికి వచ్చే జనవరి చివరి వరకు గడువు ఇస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ రంగానికి సంబంధించి తన డిమాండ్లను నెరవేర్చడంలో మోదీ సర్కార్ మూడేళ్లుగా విఫలమౌతోందని మహారాష్ట్ర అహ్మద్‌నగర్ జిల్లాలోని తన స్వగ్రామం రాలేగావ్ సిద్ధిలో విమర్శించారు.
"కేంద్రంపై నాకు నమ్మకం లేదు. ప్రతిసారీ నిరాశను మిగుల్చుతోంది. ఉత్త వాగ్ధానాలతో విసిగిపోయాను. కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఏడాది జనవరి చివరి వరకు గడువు ఇస్తున్నాను. నా డిమాండ్ల పై స్పందించకపోతే నిరాహార దీక్ష చేపడతాను. అదే నా ఆఖరి దీక్ష అవుతోంది."