Idgah Maidan : కర్ణాటక.. హుబ్లీలోని ఈద్గా మైదానం గణేశ్ చతుర్థి వేడుకల వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. మంగళవారం అర్ధరాత్రి ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ అంజుమన్ ఇస్లాం సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఈలోపల ఈద్గా మైదాన్ ఉత్సవ కమిటీ సభ్యులు గణపయ్య చిన్న విగ్రహాన్ని హడావుడిగా ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు.
అసలేం జరిగిందంటే?
హుబ్లీలోని ఈద్గా మైదాన్‌లో గత కొన్నేళ్లుగా వినాయక చవితి వేడుకలు జరుగుతున్నాయి. అయితే ఈ సారి అక్కడ పూజలు నిర్వహించడాన్ని సవాలు చేస్తూ అంజుమన్ ఇస్లాం సంస్థ.. కర్ణాటక హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది. వాటిని పరిశీలించిన ఆ రాష్ట్ర హైకోర్టు.. మంగళవారం అర్ధరాత్రి కొట్టిపారేసింది. గణేశ్ ఉత్సవాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే అంజుమన్ ఇస్లాం సంస్థ.. సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది.