Animals Attack on Devotees in Tirupati: తిరుపతి.. ప్రముఖ పుణ్యక్షేత్రం. ఎప్పుడు తీరిక దొరికిన చాలా మంది తిరుమలకు వచ్చి స్వామి వారి సేవలో పాల్గొంటారు. అయితే స్వామి వారిని దర్శించుకునేందుకు చాలా మంది ఎంచుకునేది మెట్ల మార్గం. అయితే ఇప్పుడా మార్గంలో ప్రయాణించాలంటే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లల తల్లిదండ్రులు అయితే క్షణక్షణం భయం భయంగా ఉంటున్నారు. ఎటు వైపు నుంచి ఏ జంతువు వచ్చి దాడి చేస్తోందో తెలియని పరిస్థితి నెలకొంది. ఎంత జాగ్రత్తగా ఉన్నా జంతువుల దాడి నుంచి తప్పించుకోలేకపోతున్నారు. తాజాగా నిన్న రాత్రి జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. అయితే అలిపిరి మార్గంలో వరుస దాడులు జరుగుతున్నా టీటీడీ అధికారులు తీసుకునే చర్యలు ఏంటి? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
Bear in Tirumala: తిరుమల కాలినడక మార్గంలో అర్ధరాత్రి ఎలుగుబంటి హల్చల్..
Leopard Attacked on Six Years Girl: ఆగస్టు 11న నెల్లూరు జిల్లాకు చెందిన లక్షిత అనే ఆరేళ్ల చిన్నారిని చిరుత హతమార్చిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. గత కొద్దీ రోజులుగా నరసింహ స్వామి ఆలయానికి సమీపంలో చిరుత సంచరిస్తోందని సమాచారం. రెండు రోజుల క్రితం కూడా ఇదే ప్రాంతంలో నిద్రిస్తున్న కార్మికులపై కూడా చిరుత దాడి చేసినట్లు పలువురు చెబుతున్నారు. సరిగ్గా రెండు రోజుల తరువాత కూడా అదే ప్రాంతంలో లక్షితపై దాడి చేసి చంపేయడంతో ఈ అంశం మరోమారు సంచనం రేపింది.
Chirutha Attack on Girl: అలిపిరి కాలినడక మార్గంలో చిరుత దాడి.. బాలిక మృతి
Leopard Attacked on Boy in Tirupati: కాగా ఇదే సంవత్సరం.. సరిగ్గా రెండు నెలల క్రితం (జూన్ 22) తిరుమల నడకదారిలో ఇలాంటి ఘటనే జరిగింది. ఈ ఘటనలో కౌశిక్ అనే బాలుడు గాయపడ్డాడు. కర్నూలు జిల్లా ఆదోని హనుమాన్ నగర్‌కు చెందిన శిరీష, కొండయ్యల కుమారుడు ఐదేళ్ల కౌశిక్‌పై ఏడో మైలురాయి వద్ద చిరుత దాడి చేసింది. కౌశిక్ మెడ కరుచుకుని అమాంతం అడవిలోకి లాక్కెళ్లింది. చుట్టూ ఉన్న వాళ్లు కేకలేయడంతో వెంటనే వదిలేసి పరారైంది. చిరుత దాడిలో బాలుడు కౌశిక్ తీవ్రంగా గాయపడి.. తిరుపతిలోని చిన్న పిల్లల ఆస్పత్రిలో చికిత్స తర్వాత కోలుకున్నాడు.
Leopard Trapped: బోనులో చిక్కిన చిరుత.. ఊపిరి పీల్చుకున్న భక్తులు