తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సీబీఐ ఎఫ్ఐఆర్​పై బాంబే హైకోర్టుకు దేశ్​ముఖ్ - అవినీతి ఆరోపణలపై సీబీఐ కేసు

సీబీఐ తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్​ను కొట్టివేయాలని మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్​ముఖ్.. బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు. తనపై సీబీఐ చర్యలు తీసుకోకుండా ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. నెలకు రూ.100 కోట్లు వసూలు చేసేలా పోలీసులకు దేశ్​ముఖ్ ఆదేశాలు జారీ చేశారన్న ఆరోపణలపై సీబీఐ విచారణ జరుపుతోంది.

MH DESHMUKH CBI
సీబీఐ ఎఫ్ఐఆర్​పై బాంబే హైకోర్టుకు దేశ్​ముఖ్

By

Published : May 4, 2021, 5:31 AM IST

అవినీతి ఆరోపణల విషయంలో సీబీఐ తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్​ను కొట్టివేయాలని కోరుతూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్​ముఖ్. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా రక్షణ కల్పిస్తూ ముందస్తు ఉత్తర్వులు జారీ చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ వారంలోనే పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది.

నెలకు రూ.100 కోట్లు వసూలు చేసేలా పోలీసులకు దేశ్​ముఖ్ ఆదేశాలు జారీ చేశారని ముంబయి మాజీ కమిషనర్ పరమ్​బీర్ సింగ్ చేసిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించింది. విచారణలో భాగంగా.. దేశ్​ముఖ్​పై అధికారికంగా దర్యాప్తు చేసేందుకు తగిన ఆధారాలు లభించిన నేపథ్యంలో ఇటీవలే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

ఇదీ చదవండి:'ఒక సిటీ స్కాన్..​ 400 ఎక్స్‌రేలతో సమానం'

ABOUT THE AUTHOR

...view details