తాను అధికార దుర్వినియోగానికి పాల్పడ్డానంటూ వస్తున్నఆరోపణలు తీవ్రంగా బాధించాయని మహారాష్ట్ర హోం మంత్రి అనిల్దేశ్ముఖ్ అన్నారు. అనుమానం ఉంటే తాను ఆసుపత్రిలో ఉన్నప్పటి రికార్డులను పరిశీలించాలని కోరారు.
నెలకు వందకోట్లు సంపాదించాలని ముఖేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు కేసులో అరెస్టైన పోలీసు అధికారి సచిన్ వాజేతో హోంమంత్రి అనిల్దేశ్ముఖ్ చెప్పారంటూ ముంబయి మాజీ పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్.. సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు లేఖ రాశారు. దీంతో ఈ లేఖ మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర అలజడిని సృష్టించింది. హోం మంత్రి రాజీనామా చేయాలని ప్రతి పక్ష భాజపా డిమాండ్ చేసింది.