Mother burns child: ఉత్తర్‌ప్రదేశ్ గోరఖ్‌పుర్‌లో అమ్మతనానికే మచ్చ తెచ్చే ఘటన జరిగింది. ఐదేళ్ల చిన్నారికి 17 చోట్ల వాతలు పెట్టింది ఓ తల్లి. చిన్నారి పాఠశాలకు వెళ్లనని మారాం చేయడం వల్ల ఆగ్రహించిన తల్లి.. కత్తిని స్టవ్‌పై పెట్టి వేడి చేసి శరీరంపై 17 చోట్ల వాతలు పెట్టింది. ఈ విషయం తెలుసుకున్న బాలిక తండ్రి ఇంటికి చేరుకున్నాడు. అనంతరం బాలికను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి తన భార్యపై కేసు పెట్టాడు.
సంత్ కబీర్‌నగర్‌కు చెందిన కాంచన, కాలేశ్వర్కు చెందిన రాహుల్ ప్రేమించుకున్నారు. వీరిద్దరూ 2016లో వివాహం చేసుకున్నారు. వీరికి ఐదేళ్లు, 9నెలల వయసున్న చిన్నారులు ఉన్నారు. వీరి వివాహానికి రాహుల్ కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పడం వల్ల కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే చిన్నారిని తొలిసారిగా స్థానిక పాఠశాలలో చేర్పించారు. ఎప్పటిలాగే రాహుల్ పనికి వెళ్లాడు. చిన్నారిని తల్లి పాఠశాలకు వెళ్లమని చెప్పగా.. నిరాకరించింది. దీంతో ఆగ్రహించిన తల్లి.. 17 చోట్ల కత్తితో వాతలు పెట్టింది.