మహారాష్ట్ర నండూర్బార్ జిల్లాలో నర్మదా నది ఒడ్డున ఉండే అక్కల్కువా, ధండ్గావ్ తాలుకాలు చాలా మారు ప్రాంతాలు. ఆ తాలుకాలో కనీస సౌకర్యాలు కూడా ఉండవు. మొబైల్ నెట్వర్క్ కూడా ఉండదు.
అంతటి వెనుకబడిన ప్రాంతంలో రేణు రమేశ్ అనే అంగన్వాడీ కార్యకర్త పనిచేస్తున్నారు. పిల్లలకు ఆహారం అందించేందుకు రోజూ 18 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తారు. ఇంతదూరం నడక దారిన లేదా పడవపైన వెళ్లి పిల్లలకు పోషకాహారం అందిస్తున్నారు రేణు. ఇందుకు తన సొంత డబ్బులే ఖర్చు చేస్తారామె.