తెలంగాణ

telangana

ETV Bharat / bharat

విమానంలోనే దర్జాగా స్మోకింగ్​- ఆంధ్ర వ్యక్తి అరెస్ట్​ - ఆంధ్ర వ్యక్తి అరెస్ట్​

విమానంలో పొగతాగటం నిషేధం అని తెలిసినా ఓ వ్యక్తి సిగరెట్​(smoking in flight) కాల్చాడు. తోటి ప్రయాణికులు, విమాన సిబ్బంది చెప్పినా వినలేదు. దురుసుగా ప్రవర్తించి.. చివరకు అరెస్టయ్యాడు.

smoking inside flight
విమానంలోనే దర్జాగా స్మోకింగ్​

By

Published : Nov 12, 2021, 10:33 AM IST

బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధం. బస్సులు, రైళ్లలో పొగతాాగరాదు అని చూసే ఉంటాం. అలాంటిది ఓ వ్యక్తి ఏకంగా విమానంలోనే స్మోకింగ్(smoking in flight) చేసి కటకటాలపాలయ్యాడు. ఈ సంఘటన కువైట్​ నుంచి చెన్నై వచ్చిన విమానంలో(smoking on airplanes) జరిగింది. నిందితుడిని ఆంధ్రప్రదేశ్​కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.

ఏం జరిగిందంటే?

ఆంధ్రప్రదేశ్​కు చెందిన మహమ్మద్​ షెరీఫ్​(57).. కువైట్​ నుంచి ఇండిగో ఎయిర్​లైన్స్​లో చెన్నైకి బుధవారం బయలుదేరాడు. అందులో మొత్తం 137 మంది ప్రయాణికులు ఉన్నారు. తన దుస్తుల్లో దాచి సిగరెట్లను అక్రమంగా విమానంలోకి​ తీసుకొచ్చాడు. ఫ్లైట్​ గాల్లోకి ఎగిరిన క్రమంలో వాటిని తీసి పొగతాగటం(smoking in flight) ప్రారంభించాడు. స్మోకింగ్​ చేయొద్దని తోటి ప్రయాణికులు చెప్పినా వినలేదు. దాంతో విమాన సిబ్బందికి ఫిర్యాదు చేశారు.

ఎయిర్​ హోస్టెస్​ వచ్చి సిగరెట్(smoking on airplanes)​ తాగొద్దని చెప్పినా వారి మాట వినకుండా పొగ తాగటం కొనసాగించాడు. క్యాబిన్​ సిబ్బంది, ఎయిర్​ హోస్టెస్​తో వాగ్వాదానికి కూడా దిగాడు.

చెన్నైలో విమానం దిగిన వెంటనే భద్రతా సిబ్బంది షెరీఫ్​ను అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణ తర్వాత విమానాశ్రయ పోలీస్​ స్టేషన్​లో అప్పగించారు.

ఇదీ చూడండి:విమానంలో ఒక్కరే ప్రయాణిస్తే ఆ కిక్కే వేరప్పా!

ABOUT THE AUTHOR

...view details