Andhra Ex CM Nara Chandrababu Naidu Arrested in Fraud Case : అదే ఖాకీ డ్రస్సు.. అదే టోపీ.. అదే లాఠీ..! కానీ పోలీస్ తీరే వేరు..! నచ్చితే ఒకలా, నచ్చకపోతే మరోలా..! అధికారపార్టీ అయితే ఒకలా, ప్రతిపక్షమైతే మరోలా పని చేస్తారు..! వివేకా హత్య(YS Viveka Murder Case) కేసులో నిందితుడైన అవినాష్‌రెడ్డిని సీబీఐ(CBI) అరెస్టు చేయకుండా మోకాలడ్డిన అదే పోలీసులు.. చంద్రబాబు అరాచక అరెస్టుకు మాత్రం పూర్తిగా సహకరించారు.
ఈ సీన్ గుర్తుందా! ఆస్పత్రి ఆవరణలో వైఎస్‌అవినాష్‌రెడ్డి(YS Avinash Reddy).. ఆస్పత్రి బయట వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్, ఆ పార్టీ నేత ఎస్వీ మోహన్ రెడ్డి.. చుట్టూ అధికార పార్టీ అనుచరగణం. గుర్తొచ్చింది కదూ..! బాబాయ్ వివేకానంద హత్యకేసులో నిందితుడు అవినాష్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేయడానికి వచ్చినప్పుడు .. ఆడిన జగన్నాటకంలో రక్తికట్టించిన సీన్ ఇది. అవినాష్‌రెడ్డి అమ్మకు అనారోగ్యం పేరిట అప్పట్లో కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో దాదాపు 8రోజులపాటు.. హైడ్రామా నడిచారు. అనుచరుల్ని మోహరించారు. వాళ్లను ముప్పూటలా మేపి.. హంగామా సృష్టించారు. ఇలా సీబీఐనే ముప్పుతిప్పలు పెట్టి.. 3చెరువుల నీరు తాగించారు. అవినాష్‌పై చర్యలు తీసుకుంటే.. భద్రత కల్పించలేమంటూ రాష్ట్ర పోలీసులతోనే చెప్పించి.. సీబీఐనే ఇంటిదారి పట్టించారు.
Chandrababu Vs Avinash Reddy : ఇప్పుడు చంద్రబాబును అరెస్టు చేసిన తీరును పరిశీలిద్దాం. 14ఏళ్లు సీఎంగా, 9 ఏళ్లు ప్రతిపక్షనేతగా పనిచేసిన చంద్రబాబును అరెస్టు చేసేందుకు.. అర్ధరాత్రి దండెత్తారు. కేసేమిటో చెప్పలేదు. అసలు ఎందుకు అరెస్టు చేయాలనుకుంటున్నారో ఆధారాలూ కూడా చూపలేదు. పైగా మీకెందుకు చెప్పాలంటూ ఎదురుదాడికి దిగారు. ఎన్ఐఏ అభ్యంతరం చెప్తున్నా వినకుండా.. చంద్రబాబు నిద్రిస్తుండగా బస్సు వద్దకు వెళ్లారు. నిద్రలేవాలంటూ.. బస్సు తలుపుకొట్టారు.
Ganta Srinivasa Rao Arrested: మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అరెస్టు..!