ఒడిశా భువనేశ్వర్‌లో జరిపిన తవ్వకాల్లో పురాతన ఆలయ నిర్మాణం బయటపడింది. ఏకామ్రా క్షేత్ర ప్రాంతంలోని ప్రాచీన లింగరాజ్ మందిర సమీపంలో ఈ పురాతన కట్టడాలు కనిపించాయి. ఈ నిర్మాణం పదో శతాబ్దానికి చెందినదని అక్కడివారు విశ్వసిస్తున్నారు.
తవ్వకాల్లో బయటపడిన పురాతన ఆలయం - లింగరాజ్ దేవాలయం ఏకామ్రా క్షేత్ర తవ్వకాల్లో ప్రాచీన ఆలయ కట్టడాలు
ఒడిశాలో ఓ పురాతన ఆలయ నిర్మాణం బయటపడింది. భువనేశ్వర్‌లోని ఏకామ్రా క్షేత్రంలో ఈ ప్రాచీన కట్టడాలను గుర్తించారు పురావస్తు శాఖ అధికారులు. ఇవి 10వ శతాబ్దం నాటికి చెందినవని ప్రాథమిక అంచనాకు వచ్చారు.
![తవ్వకాల్లో బయటపడిన పురాతన ఆలయం Ancient temple unearth in Bhubaneswar while digging in Odisha](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10419785-thumbnail-3x2-sureshbabu1.jpg)
తవ్వకాల్లో బయటపడిన పురాతన ఆలయం!
ఏకామ్రా క్షేత్రంలోని సుకశరీ ఆలయాన్ని మరింత అందంగా తీర్చిదిద్దేందుకు పురావస్తు శాఖ ఇటీవల చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఆ పరిసర ప్రాంతాల్లో నిర్మాణ పనులు చేపట్టగా.. తవ్వకాల్లో ఈ ప్రాచీన ఆలయ నిర్మాణాన్ని గుర్తించింది. ఇప్పటివరకు 12 అడుగుల లోతువరకు తవ్వగా.. ఇంకాస్త లోతుకు వెళితే మరింత స్పష్టత వస్తుందని పురావస్తు శాఖ అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి:రామ మందిర శకటం.. అత్యుత్తమం