Anand sharma resigns : హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు సీనియర్ నేత ఆనంద్ శర్మ. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. పార్టీ సమావేశాలకు తనను ఆహ్వనించడం లేదని.. అందుకే తన ఆత్మగౌరవాన్ని చంపుకోలేకే రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. జమ్ముకశ్మీర్ ప్రచార కమిటీ ఛైర్మన్ పదవికి కొద్ది రోజుల క్రితం రాజీనామా చేసిన జీ23 నేత గులాం నబీ ఆజాద్ బాటలోనే శర్మ పయనించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే పార్టీ అభ్యర్థుల ప్రచారం కోసం మాత్రం తైను పని చేస్తానని కాంగ్రెస్ అధినేత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు ఆనంద్ శర్మ.
ఆనంద్ శర్మ అంతకుముందు కేంద్ర మంత్రిగా, రాజ్యసభ డిప్యూటి లీడర్‌గా సేవలు అందించారు. ఆయన్ను ఏప్రిల్ 26న హిమాచల్‌ప్రదేశ్ స్టీరింగ్ కమిటీ ఛైర్మన్‌గా నియమించారు. ఈ కమిటీలో దిగ్గజ నేతలు భూపిందర్ సింగ్ హుడా, మనీశ్ తివారీ ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో బలమైన నేతగా ఉన్నారు ఆనంద్ శర్మ. 1984లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు.
ఈ ఏడాది చివర్లో హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.