ముంబయిలో ప్రముఖ తాజ్ హోటల్లో రూ.6కే గది! ఇంత విశాలవంతమైన, అత్యద్భుతంగా ఉండే హోటల్లో రూ. 6కే గది దొరకడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అయితే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర చేసి ట్వీట్ చూడాల్సిందే.
సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉండే ఆనంద్ మహీంద్ర.. ట్విట్టర్లో తాజ్ హోటల్‌కు సంబంధించి ఓ ట్వీట్ చేశారు. ఇప్పడంటే రూ. వేలు, రూ. లక్షల్లో గది రెంట్ ఉంటుందేమో కానీ.. 1903లో మాత్రం రూ. 6కే హొటల్లో విశాలవంతమైన గది దొరికేదని ఈ ట్వీట్ చూస్తే అర్థమవుతుంది.