ప్రతిభను గుర్తించి, ప్రోత్సహించే వారిలో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ముందువరుసలో ఉంటారు. ట్విట్టర్లో చురుకుగా ఉండే ఆయన.. ఈ విషయాన్ని ఎన్నోసార్లు రుజువు చేశారు. తాజాగా క్రికెట్ ఆడుతున్న ఓ ఆరేళ్ల చిన్నారి వీడియోపై ప్రశంసల వర్షం కురిపించిన ఆయన.. ఇలాంటి వారి ప్రతిభ వృథా అవ్వకూడదని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి:ఆస్కార్ చిత్రంలో మహీంద్రా- నెటిజన్లు ఫిదా
'నాకు ఎందుకు నేర్పించరు?'
ఈ వీడియోను ఆనంద్.. తన ఫాలోవర్లతో పంచుకున్నారు. అందులో కేరళ కోజికోడ్‌కు చెందిన మెహక్ ఫాతిమా.. ప్యాడ్లు, హెల్మెట్ ధరించి క్రికెట్ ఆడుతోంది. అద్భుతంగా బ్యాటింగ్ చేస్తోంది. ఆమెను భవిష్యత్ సూపర్‌స్టార్‌గా అభివర్ణించిన ఆనంద్.. చిన్నారి గురించి కేంద్రమంత్రి కిరణ్ రిజుజు దృష్టికి తీసుకెళ్లారు. ఇలాంటి ప్రతిభను వదులుకోకూడదని తెలిపారు.
అయితే ఫాతిమా క్రికెట్ ఆడటం వెనుక ఓ కథ ఉంది. ఫాతిమాకు మూడేళ్ల తమ్ముడున్నాడు. తొలుత తమ్ముడికి క్రికెట్ నేర్పాడు ఫాతిమా తండ్రి. అది చూసి.. 'నేను అమ్మాయిని కాబట్టి క్రికెట్ నేర్పించట్లేదా? నాకూ నేర్పండి' అని తండ్రిని అడిగింది. అలా.. ఎంతో ఆసక్తితో క్రికెట్ నేర్చుకున్న ఫాతిమా.. ఇలా మహీంద్రాను ఫిదా చేసింది.
ఇదీ చూడండి:'అక్షర్.. నీ కళ్లద్దాలు ఎక్కడ దొరుకుతాయ్'