తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మట్కా మ్యాన్​'పై ఆనంద్​ మహీంద్ర పొగడ్తల వర్షం - ఆనంద్ మహీంద్ర న్యూస్​

నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న పేదలకు సురక్షిత మంచినీటిని అందిస్తూ ఓ పెద్దాయన ఆదర్శంగా నిలుస్తున్నాడు. జీవితంలో అసలైన సంతోషం మనకోసం కాకుండా పరుల కోసం జీవిచడంలోనే ఉందని నిరూపిస్తున్నాడు. నిస్వార్థంగా తాగు నీటిని అందిస్తూ మట్కా మ్యాన్‌గా గుర్తింపు పొందిన అలగ్‌ నటరాజన్‌పై పారిశ్రామిక దిగ్గజం ఆనంద్‌ మహీంద్ర ప్రశంసలు కురిపించారు. నటరాజన్‌ శక్తివంతమైన వ్యక్తిగా అభివర్ణిస్తూ అతడి సేవలను కొనియాడారు.

Anand Mahindra praises Matka Man
'మట్కా మ్యాన్​'పై ఆనంద్​ మహీంద్ర పొగడ్తల వర్షం

By

Published : Oct 25, 2021, 10:29 PM IST

దేశ రాజధాని దిల్లీలో మట్కా మ్యాన్‌గా గుర్తింపు పొందిన అలగ్‌ నటరాజన్‌ పేదలకు ఉచితంగా తాగు నీటిని అందజేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. నిరుపేదల చెంతకు స్వయంగా నీటిని చేరవేస్తూ వారి దాహార్తిని తీరుస్తున్నారు. ఈ సేవ కోసం నటరాజన్‌ తన పింఛను డబ్బులు, పొదుపు చేసుకున్న సొమ్మును ఖర్చుచేస్తున్నారు. కొందరు శ్రేయోభిలాషుల ఇచ్చిన విరాళాలతో గత నెలలో ఓ మహీంద్ర బొలేరో మ్యాక్సీ ట్రక్‌ను మట్కా మెన్‌ కొనుగోలు చేశారు. ఆ వాహనానికి వెయ్యి లీటర్ల నీటి నిల్వ సామర్థ్యం గల ట్యాంకులు రెండింటిని అమర్చారు. వాటి సాయంతో పేదలకు క్రమం తప్పకుండా సురక్షితమైన నీటిని సరఫరా చేస్తున్నారు.

మట్కామెన్‌గా అలగ్‌ నటరాజన్‌ చేస్తున్న సేవలను పారశ్రామిక దిగ్గజం, మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ ప్రశంసించారు. ఈ మేరకు ఓ వీడియోను తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. పేదల కోసం నటరాజన్‌ చేస్తున్న కృషిని అభినందించారు. అద్భుతమైన వ్యక్తులందరిలోనూ అత్యంత శక్తిమంతుడైన వ్యక్తి నటరాజన్‌ అంటూ ఆనంద్‌ మహీంద్ర ప్రశంసల వర్షం కురిపించారు.

తొలుత ఇంగ్లండ్‌లో వ్యాపారం చేసిన నటరాజన్‌ క్యాన్సర్‌ బారినపడ్డారు. చికిత్స అనంతరం క్యాన్సర్​పై చేయి సాధించిన ఆయన.. భారత దేశానికి తిరిగి వచ్చారు. అప్పటి నుంచి నిరాడంబరంగా పేదలకు సేవలందిస్తూ ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మరోవైపు నటరాజన్‌ చేస్తున్న కృషికి గాను అతడ్ని నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. దయార్థ్ర హృదయంతో ఆయన చేస్తున్న సేవలు సమాజానికి ఎంతో ఆదర్శనీయమని అభినందిస్తున్నారు.

ఇదీ చదవండి:'రూ.లక్ష కాదు రూ.2 కోట్లు కడతా.. కానీ జడ్జి అలా అనడం...'

ABOUT THE AUTHOR

...view details