కరోనా నేపథ్యంలో జూమ్ వీడియో కాలింగ్‌లు విపరీతంగా పెరిగిపోయాయి. ముఖ్యమైన కార్యక్రమాలు సైతం జూమ్ వేదికగానే నిర్వహిస్తున్నారు. అయితే.. ఇలాంటి జూమ్ కాల్లో ఉండగానే ఓ వ్యక్తికి తన భార్య ప్రేమగా ఓ చిలిపి ముద్దు ఇచ్చేందుకు వచ్చింది. అయితే.. 'వీడియో ఆన్‌లో ఉంది. నీకెమన్నా పిచ్చిపట్టిందా!' అంటూ తన భార్యను అసహ్యించుకున్నాడు ఆ వ్యక్తి. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారి అందరినీ కడుపుబ్బా నవ్విస్తోంది. సంబంధిత వీడియోను ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా కూడా నెట్టింట పంచుకున్నారు.
'ఉత్తమ భార్య తనే..'