తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఒకే మొక్కకు టమాటా, వంకాయ! - ఐసీఏఆర్‌ నూతన టమాటా వంగడాలు

కూరగాయల సాగులో ఉత్పాదకతను పెంచేందుకు వినూత్న మొక్కను ఆవిష్కరించింది వ్యవసాయ పరిశోధన మండలి. ఒకే మొక్కకు టమాటా, వంకాయలు కాసేలా అభివృద్ధి చేసింది. ఈ నూతన విధానం పట్టణ, పట్టణ శివారు ప్రాంతాలకు బాగా ఉపయోగపడుతుందని ఐసీఏఆర్‌ పేర్కొంది.

innovative technology
ఒకే మొక్కకు టమాటా వంకాయ

By

Published : Oct 8, 2021, 7:02 AM IST

ఒకే మొక్కకు వంకాయ, టమాటా కాసే కొత్త విధానాన్ని భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్‌) ఆధ్వర్యంలోని వారణాశి కూరగాయల పరిశోధన సంస్థ అభివృద్ధి చేసింది. సంకరజాతి వంకాయ రకం కాశీ సందేశ్‌ను, టమాటా రకం కాశీ అమన్‌తో అంటుకట్టి ఒకే మొక్కకు ఒకేసారి రెండు రకాల కాయలు కాసేలా చేసింది. కొత్త మొక్కను 15 నుంచి 18రోజుల తర్వాత భూమిలో నాటి పరీక్షించారు. మొక్క తొలిదశలో వంకాయ, టమోటా కొమ్మలు సమతౌల్యంగా పెరిగేలా చర్యలు తీసుకున్నారు.

హెక్టార్‌కు 25 టన్నుల సేంద్రియ ఎరువుతో పాటు రసాయన ఎరువు (ఎన్‌పీకే 150:60:100)ను కిలో మేరకు వేసి పరీక్షించారు. ఇలా అంటుకట్టిన కొత్తమొక్కల్లో 60 నుంచి 70 రోజుల తర్వాత వంకాయ, టమాటా కాయడం ప్రారంభమైనట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ప్రయోగాత్మక దశలో ఒక్కో మొక్కకు సగటున 2.383 కిలోల టమాటాలు, 2.684 కిలోల వంకాయలు కాసినట్లు చెప్పారు. ఈ నూతన విధానం పట్టణ, పట్టణ శివారు ప్రాంతాలకు బాగా ఉపయోగపడుతుందని ఐసీఏఆర్‌ పేర్కొంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details