తమిళనాడులో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ పాఠశాల టాయిలెట్ వద్ద నవజాత శిశువు మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన డిసెంబర్ 8న జరగగా ఆలస్యంగా బయటకు వచ్చింది. పుట్టిన వెంటనే శిశువును టాయిలెట్ వద్ద పడేశారు. తిరుచ్చి జిల్లాలోని తిరువెరుంపూర్ సమీపంలోని కట్టూర్‌లోని ఓ స్కూల్ టాయిలెట్ వద్ద నవజాత మగ శిశువు శవంగా కనిపించింది. దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. శిశువు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష నిమిత్తం తరలించారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పాఠశాల ఆవరణలోనే ఈ శిశువు పట్టిందా?లేక ఎవరైనా ఈ శిశువును తీసుకొచ్చి పాఠశాల టాయిలెట్ వద్ద వదిలేశారా? అన్న కోణంలో విచారిస్తున్నారు.
స్కూల్ టాయిలెట్ వద్ద నవజాత శిశువు మృతదేహం.. పుట్టిన గంటల్లోనే..! - tamil nadu latest news
తమిళనాడులో ఓ పాఠశాల టాయిలెట్ వద్ద నవజాత శిశువు మృతదేహం లభ్యమైంది. పుట్టిన వెంటనే శిశువును ప్రభుత్వ బాలికల పాఠశాల టాయిలెట్ వద్ద పడేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
An infants body found in a government school toilet near tamil nadu
మరోవైపు పాఠశాల విద్యాశాఖ అధికారులు సైతం ఘటనా స్థలానికి వచ్చి విద్యార్థినులలో ఎవరికైనా ఈ బిడ్డ పుట్టిందా? అనే అనుమానంతో విచారణ చేపట్టారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండేందుకు పాఠశాల ఆవరణలో సరిపడా సెక్యూరిటీ గార్డులను నియమించాలని ఆదేశించారు. పాఠశాల ఆవరణలో సీసీటీవీలు ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.