చైనాతో సరిహద్దు ఉద్రిక్తత నేపథ్యంలో తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో మోహరించిన సైనికుల భద్రత కోసం కేేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. చలికాలం ప్రారంభమైన నేపథ్యంలో సైనిక బలగాలకు అతి శీతల వాతావరణంలో ధరించే దుస్తులను అందజేసినట్లు తెలుస్తోంది.
ఇక ఎంత చలి అయినా సైన్యం బేఫికర్ - China border
చలికాలం ప్రారంభమైన నేపథ్యంలో సరిహద్దుల్లోని సైన్యానికి అతి శీతల వాతావరణంలో ధరించే దుస్తులను అధికారులు అందించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆ దస్తులు ధరించిన ఓ జవాను ఫొటోను అధికారులు విడుదల చేశారు.

జవాన్లకు అతి శీతల వాతావరణంలో ధరించే దుస్తులు
ఈ మేరకు అత్యంత చలి వాతావరణంలో ధరించే దస్తులతో ఉన్న జవాను ఫొటోను అధికారులు విడుదల చేశారు. ఇవి అత్యంత శీతల పరిస్థితుల్లో కూడా సైన్యం తట్టుకొని నిలబడి ఉండటానికి దోహదం చేస్తాయి. ఈ దుస్తులను అమెరికా నుంచి తెప్పించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ఇదీ చూడండి:సైన్యానికి చలి నుంచి రక్షణ కల్పించేందుకు..