తెలంగాణ

telangana

'బదిలీలపై ఉద్యోగులు ఒత్తిడి తీసుకురాలేరు'

By

Published : Sep 13, 2021, 7:05 AM IST

ఒక ఉద్యోగి తనను నిర్దిష్ట ప్రదేశానికి బదిలీ చేయాలని పట్టుపట్టడం సరికాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తన అవసరాలకు అనుగుణంగా బదిలీ చేయాలని ఓ లెక్చరర్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.

sc
sc

అవసరాలకు అనుగుణంగా ఉద్యోగులను బదిలీ చేసే అధికారం యజమానులదేనని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఫలానా చోటికి బదిలీ చేయాలంటూ ఉద్యోగులు ఒత్తిడి తీసుకురాలేరని తెలిపింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమ్రోహాలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్న ఒకామె తనను గౌతమ బుద్ధనగర్‌కు బదిలీ చేయాలని కోరగా, సంబంధిత అధికారులు తిరస్కరించారు. దీనిపై ఆమె అలహాబాద్‌ హైకోర్టును ఆశ్రయించగా అక్కడ కూడా నిరాశే ఎదురయింది.

దీంతో ఆమె సుప్రీంకోర్టులో అప్పీలు చేయగా న్యాయమూర్తులు జస్టిస్‌ ఎం.ఆర్‌.షా, జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. "ఎక్కడికి బదిలీ చేయాలో, చేయకూడదో అని ఒత్తిడి తెచ్చే అధికారం ఉద్యోగికి లేదు. అవసరాల మేరకు యజమానే బదిలీ చేస్తారు" అంటూ ఆమె వినతిని తిరస్కరించింది. అమ్రోహాలో తాను నాలుగేళ్ల పాటు పనిచేసినందున నిబంధనల ప్రకారం బదిలీ చేయాల్సి ఉంటుందంటూ ఆమె చేసిన వాదనను అంగీకరించలేదు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details