అసోంలోని గోల్‌పరాలో మంగళవారం భారీగా భూమి కంపించింది. ఉదయం 8.45 గంటలకు ఈ భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెసిమాలజీ వెల్లడించింది. రిక్టర్ స్కేల్‌పై ఈ భూకంపం తీవ్రత 5.2గా నమోదైందని.. 14 కిలోమీటర్ల లోతున భూకంపం కేంద్రీకృతమైందని పేర్కొంది.
భూకంపం ధాటికి మేఘాలయా, బంగాల్ రాష్ట్రాలు సహా బంగ్లాదేశ్‌లో కూడా ప్రకంపనలు నమోదయ్యాయి. బంగాల్లోని అలీపుర్దౌర్, జల్పాయ్గురి సహా బంగ్లాదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు వచ్చినట్లు స్థానిక మీడియా పేర్కొంది.