కర్ణాటక మండ్య సమీపంలో పౌరాణిక నాటక ప్రదర్శనలో ఓ కళాకారుడు వేదికపైనే ప్రాణాలు విడిచాడు. సార్థకి వేషంలో నటిస్తున్న ఓ వ్యక్తి గుండెపోటుతో మరణించాడు.
బండూర్ గ్రామంలో బసవన్న ఆలయంలో 'కృష్ణ సంధానం' అనే నాటక ప్రదర్శన నిర్వహించారు. ఇందులో పాల్గొనేందుకు వేర్వేరు గ్రామాల నుంచి కళాకారులు వచ్చారు. సార్థకి పాత్రధారి అయిన నంజయ్య(46) అనే వ్యక్తి స్టేజిపై ప్రదర్శన ఇస్తుండగా.. ఆయనకు గుండెపోటు వచ్చింది. నంజయ్య వేదికపైనే కుప్పకూలిపోయాడు.
డ్రామా వేస్తుండగా గుండెపోటు.. వేదికపైనే కళాకారుడు మృతి - కృష్ణ సంధానం నాటక ప్రదర్శనలో మృతి చెందిన నంజయ్య
పౌరాణిక నాటక ప్రదర్శనలో గుండెపోటుతో ఓ కళాకారుడు కుప్పకూలిపోయి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ విషాదకర ఘటన కర్ణాటక మండ్య సమీపంలో జరిగింది.
స్టేజిపైనే గుండెపోటుతో మృతి చెందిన నంజయ్య
ఈ హఠాత్ పరిణామంతో తోటి కళాకారులు, నిర్వాహకులు, ప్రేక్షకులు షాక్ అయ్యారు. వెంటనే నాటక ప్రదర్శనను మధ్యలోనే ఆపేసి.. ఆ కళాకారుడిని మలవల్లి పట్టణంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. అయితే అతడు స్టేజిపైనే మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు.
ఇంతకుముందు కూడా కర్ణాటకలో ఇలాంటి ఘటనే జరిగింది. యక్షగాన ప్రదర్శనలో పాల్గొన్న ఓ కటిల్ మేళా కళాకారుడు గుండె పోటుతో స్టేజిపైనే కుప్పకూలిపోయాడు. పూర్తివివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.