ఎయిర్ ఇండియా విమానం అత్యవసర ల్యాండింగ్ - ఎయిర్ ఇండియా విమానం

ఎయిర్ ఇండియా విమానం
10:20 April 09
ఎయిర్ ఇండియా విమానం అత్యవసర ల్యాండింగ్
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం.. కేరళలోని కోజికోడ్‌లో అత్యవసర ల్యాండింగ్ అయింది. విమానంలోని కార్గో కంపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదానికి సంబంధించిన అలారం శబ్దం వినిపించగా.. పైలట్లు విమానాన్ని మధ్యలోనే ఆపినట్లు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు.
కోజికోడ్ నుంచి కువైట్‌కు 17 మంది ప్రయాణికులతో వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని అధికారులు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Last Updated : Apr 9, 2021, 11:39 AM IST