తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సమానత్వం, రక్తదానంపై అవగాహనకు బైక్ యాత్ర.. రోజుకు 400 కి.మీ ప్రయాణం - బైక్​ రైడర్​ విజు వర్గీస్ భారత్​ నుంచి నేపాల్​

రక్తదానం, సమానత్వంపై అవగాహన కల్పించేందుకు నడుంబిగించాడు కర్ణాటకకు చెందిన ఓ యువకుడు. రాయల్ ఎన్​ఫీల్డ్ బైక్​పై భారత్​లోని కొన్ని రాష్ట్రాలు సహా నేపాల్​, భూటాన్​లోనూ బైక్ యాత్ర చేపట్టేందుకు సిద్ధమయ్యాడు. తాను తిరిగిన రాష్ట్రాల్లో మట్టిని సైతం సేకరించి.. దేశంలోని ప్రముఖులకు ఇస్తానని చెబుతున్నాడు. ఆ యువకుడు బైక్ యాత్ర గురించి ఓసారి లుక్కేద్దాం.

vijju vargis bike rider travel from india to nepal
భారత్​ నుంచి నేపాల్​, భూటాన్​లకు యువకుడి యాత్ర

By

Published : Feb 6, 2023, 7:31 PM IST

Updated : Feb 6, 2023, 11:00 PM IST

సమానత్వం, రక్తదానంపై అవగాహనకు బైక్ యాత్ర.. రోజుకు 400 కి.మీ ప్రయాణం

సమానత్వం, రక్తదానం మీద అవగాహన కల్పించేందుకు బైక్ యాత్రకు శ్రీకారం చుట్టాడు ఓ యువకుడు. దేశంలోని అనేక రాష్ట్రాలతో పాటు పొరుగు దేశాలైన నేపాల్​, భూటాన్​లనూ సందర్శిస్తానని చెబుతున్నాడు. అతడే కర్ణాటకలోని శివమొగ్గకు చెందిన విజు వర్గీస్. ఈ భూమిపై ఉన్న మనుషులందరూ ఒక్కటే అనే భావనను తీసుకురావడానికే రాయల్ ఎన్​ఫీల్డ్​పై బైక్​ యాత్రకు సిద్ధమయ్యాడు వర్గీస్​.

అన్ని కులాలు, మతాలు ఒకటే అని చాటిచెప్పేందుకు రాయల్ ఎన్​ఫీల్డ్​పై యాత్రకు సిద్ధమయ్యాడు వర్గీస్​. రక్తదానంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తానని చెబుతున్నాడు. ఈ బైక్ యాత్ర కోసం తన దగ్గర ఉన్న రాయల్​ ఎన్​ఫీల్డ్​ బైక్​ను ఉపయోగించనున్నాడు వర్గీస్​. ఈ యాత్ర రెండు నెలల పాటు.. రోజుకు 350 నుంచి 400 కిలోమీటర్ల వరకు ప్రయాణించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు వర్గీస్​. కేవలం ప్రాంతాలను సందర్శించడమే కాకుండా అక్కడ మట్టిని సేకరిస్తానని చెబుతున్నాడు. ఆ మట్టిని దేశంలోని ప్రముఖ వ్యక్తులను పంచుతానని తెలిపాడు. ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం రక్తదానంపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడం, అందరూ సమానమనే భావనను తీసుకురావడమేనని అంటున్నాడు. సోలోగా బైక్ రైడ్​ చేయడం తనకు ఇష్టమని అన్నాడు వర్గీస్.

విజు వర్గీస్​

భారత్​.. ఆపై నేపాల్​, భూటాన్​లకు..
ముందుగా కర్ణాటకలోకి హత్తూర్​లో యాత్ర ప్రారంభించి తెలంగాణలో పర్యటిస్తాడు. అనంతరం చెన్నై, పుదుచ్చేరి, ధనుష్కోటి, కన్యాకుమారి, కేరళ, మంగళూరు, ఉడుపి, మీదుగా గోవాకి వెళ్తాడు. ఆ తర్వాత రాజస్థాన్, గుజరాత్, హరియాణా, దిల్లీ, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర మీదుగా నేపాల్‌లోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత భూటాన్ నుంచి ఈశాన్య రాష్ట్రాలైన అసోం, మిజోరాం, నాగాలాండ్, మణిపుర్ మీదుగా కర్ణాటకకు తిరిగి చేరుకుంటాడు వర్గీస్​.

ప్రత్యేక హంగులతో 'రాయల్​' బైక్​..
సుదూర ప్రాంతాలకు ప్రయాణించేందుకు అనుగుణంగా తన రాయల్ ఎన్​ఫీల్డ్ బైక్​ను రూపొందించాడు వర్గీస్​. పెట్రోల్​ను నిల్వ చేసుకునేందుకు రెండు వేర్వేరు డబ్బాలను బైక్​కు అమర్చాడు. తన లగేజీ పెట్టుకునేందుకు ప్రత్యేకంగా ఓ బాక్స్​ను తీర్చిదిద్దాడు. మట్టిని నిల్వచేసేందుకు ఓ పెట్టెను అమర్చాడు. ఈ బైక్​కు కెమెరాలతో పాటు మొబైల్ పెట్టుకునేందుకు ఏర్పాటు చేశాడు. బైక్‌ రెండు టైర్ల గాలిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు డిజిటల్ సిస్టమ్​ సౌలభ్యం ఈ బైక్​కు ఉంది. వీటితో పాటు బైక్‌కు కూలర్​ను అమర్చాడు. బైక్​ గేర్​ను కూడా కుడి నుంచి ఎడమ వైపుకు పెట్టాడు. తొమ్మిది సంవత్సరాల క్రితం విజు వర్గీస్ దక్షిణాది రాష్ట్రాల్లో విజయవంతంగా పర్యటించాడు.

యాత్ర కోసం వర్గీస్ తీర్చిదిద్దిన బైక్​​
Last Updated : Feb 6, 2023, 11:00 PM IST

ABOUT THE AUTHOR

...view details