కొవిడ్ రెండో దశ వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో భారత్కు అమెరికా మరోసారి భారీ సాయం ప్రకటించింది. భారత టీకా పంపిణీ కార్యక్రమానికి మద్దతుగా 25 మిలియన్ డాలర్లు(రూ.186 కోట్లు) సాయం కింద అందిస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు ఆ దేశ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్.
" భారత కొవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమానికి అమెరికా సాయం కింద అదనంగా 25 మిలియన్ డాలర్లను అందిస్తున్నాం. భారత్వ్యాప్తంగా టీకా సరఫరా గొలుసును బలోపేతం చేయటం ద్వారా ప్రజల ప్రాణాలు కాపాడేందుకు అమెరికా సాయం ఉపకరిస్తుంది."
- ఆంటోనీ బ్లింకెన్, అమెరికా విదేశాంగ మంత్రి.
రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత్కు వచ్చిన బ్లింకెన్.. బుధవారం విదేశాంగ మంత్రి జైశంకర్ సహా ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. కరోనా తొలినాళ్లలో భారత్ చేసిన సాయాన్ని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు భారత్కు తిరిగి సాయం చేయటం పట్ల గర్వంగా ఉందని పేర్కొన్నారు.