గుజరాత్లోని వడోదరలోని వాఘోడియా క్రాసింగ్ వద్ద ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టెంపో, కంటెయినర్ ఢీకొన్న ఘటనలో 11 మంది మరణించారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు సమీప ఆసుపత్రికి తరలించారు. వాహనం సూరత్ నుంచి పావగఢకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
గుజరాత్ వడోదర ప్రమాదంపై మోదీ దిగ్భ్రాంతి - డంపర్, ట్రక్కు ఢీ
07:22 November 18
గుజరాత్లో రోడ్డు ప్రమాదాలు- 15 మంది మృతి
కారు ప్రమాదంలో నలుగురు..
గుజరాత్లోని సురేంద్రనగర్ సమీపంలో మరో ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
మోదీ దిగ్భ్రాంతి
గుజరాత్ వడోదరలోని వాఘోడియా క్రాసింగ్ రహదారిపై రెండు ట్రక్కులు ఢీకొని 11 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అధికారులు అన్నిరకాల సాయం అందిస్తున్నట్లు చెప్పారు.