తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జేఎన్​ఎంసీ రికార్డ్​- 300మందికి ఓపెన్​ హార్ట్​ సర్జరీ - అలీగఢ్​ ముస్లిం విశ్వవిద్యాలయం

ఉత్తర్​ప్రదేశ్​ అలీగఢ్​ ముస్లిం విశ్వవిద్యాలయంలోని జవహర్​లాల్​ నెహ్రూ మెడికల్​ కళాశాల(జేఎన్​ఎంసీ) 300 మందికి విజయవంతంగా ఓపెన్​ హార్ట్​ సర్జరీ నిర్వహించి అరుదైన ఘనత సాధించింది. ఈ సందర్భంగా తమ ఆనందాన్ని 'ఈటీవీ భారత్'​తో పంచుకున్నారు హృద్రోగ విభాగాధిపతి డాక్టర్​. అజాం హసీన్​.

AMU: JNMC surgeons complete 300 rare open heart surgeries
జేఎన్​ఎంసీ రికార్డ్​- 300మందికి ఓపెన్​ హార్ట్​ సర్జరీ

By

Published : Mar 7, 2021, 12:09 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ అలీగఢ్​ ముస్లిం విశ్వవిద్యాలయంలోని జవహర్​లాల్​ మెడికల్​ కళాశాల(జేఎన్​ఎంసీ) అరుదైన ఘనత సాధించింది. ఏకంగా 300 మందికి విజయవంతంగా ఓపెన్​ హార్ట్​ సర్జరీ నిర్వహించి రికార్డు నెలకొల్పింది. ఈ సందర్భంగా వైద్యులు తమ సంతోషాన్ని 'ఈటీవీ భారత్​'తో పంచుకున్నారు.

అలీగఢ్​ ముస్లిం విశ్వవిద్యాలయం
జవహర్​లాల్​ నెహ్రూ మెడికల్​ కళాశాల(జేఎన్​ఎంసీ)
జవహర్​లాల్​ నెహ్రూ మెడికల్​ కళాశాల(జేఎన్​ఎంసీ) ఐసీయూ వార్డు
'ఈటీవీ భారత్'​తో హృద్రోగ విభాగాధిపతి డాక్టర్​. అజాం హసీన్

" మేము 2016లో ఓపెన్ హార్ట్​ సర్జరీలు చేయటం ప్రారంభించాం. ఇటీవల జరిపిన ఓపెన్​ హార్ట్​ సర్జరీతో 300 మార్కును అందుకున్నాం. కేవలం అలీగఢ్​ నుంచి మాత్రమే కాక యూపీలోని చాలా ప్రాంతాల నుంచి వైద్యం కోసం ఇక్కడకు వస్తున్నారు. ఇక్కడ తక్కువ ధరకే సర్జరీ చేస్తున్నాము."

--డాక్టర్​. అజాం హసీన్​, హృద్రోగ విభాగాధిపతి(జేఎన్​ఎంసీ)

అంతేకాక 18 ఏళ్లలోపు వారికి జేఎన్​ఎంసీలో ఓపెన్​ హార్ట్​ సర్జరీ ఉచితంగా చేస్తున్నామని డాక్టర్ అజాం హసీన్​ తెలిపారు.

ఇదీ చదవండి :టీకా రెండు డోసులు తీసుకున్నా కరోనా పాజిటివ్​!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details